విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం

ABN , First Publish Date - 2021-03-14T02:17:27+05:30 IST

జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. రోడ్డు ప్రమాదం నుంచి

విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం

కృష్ణా: జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. రోడ్డు ప్రమాదం నుంచి విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. జగ్గయ్యపేట మండలంలోని పోచంపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు, ఆటో ఢీ కొన్నాయి. పోచంపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు నందిగామ చైతన్య కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నారు. కళాశాల ముగిసిన తర్వాత గ్రామానికి ఆటోలో విద్యార్థులు బయలుదేరారు. రోడ్డు మీద వెళుతున్న కారును అతి వేగంతో వెళుతున్న ఆటో ఢీ కొట్టింది. దీంతో ఆటో పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


 ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులు మాధవి, నాగ శిరీష, రమ్యలకు  తీవ్రగాయాలయ్యాయి. సరస్వతి, భాగ్యలక్ష్మి, ప్రగతిలకు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో డ్రైవరు మితిమీరిన వేగంతో వస్తూ ఆటో కంట్రోల్ చేయలేక పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థులు చెబుతున్నారు. 

Read more