Abn logo
Sep 9 2021 @ 19:29PM

వేదాంత వీజీసీబీకు ‘గ్రీన్‌టెక్‌ ఎఫెక్టివ్‌ సేఫ్టీ కల్చర్‌ అవార్డు

విశాఖపట్నం: వేదాంతకు చెందిన వీజీసీబీకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘గ్రీన్‌టెక్‌ ఎఫెక్టివ్‌ సేఫ్టీ కల్చర్‌ అవార్డు 2021’ లభించింది. ప్రభావవంతమైన భద్రతా సంస్కృతి పరంగా అసాధారణ విజయాలకుగానూ ఈ అవార్డును అందజేశారు. వేదాంత యొక్క వీజీసీబీ వద్ద విస్తృతశ్రేణి మరియు అత్యుత్తమ శ్రేణి భద్రతా ప్రక్రియలను గ్రీన్‌టెక్‌ ఫౌండేషన్‌ అవార్డుల కోసం నిపుణులతో కూడిన బృందం తనిఖీ చేసింది. గ్రీన్‌టెక్‌ అవార్డుల కోసం ఎన్నో అగ్రశ్రేణి సంస్థలు పోటీపడ్డాయి. అత్యుత్తమ ప్రక్రియలను స్వీకరించిన కార్పోరేట్స్‌కు అవార్డులను సోనామార్గ్‌ (జె అండ్‌ కె) వద్ద జరిగిన వేడుకలో అవార్డులను అందజేశారు.