ఆరోగ్యమైన తీపిదనం!

ABN , First Publish Date - 2021-09-09T05:30:00+05:30 IST

చక్కెర, బెల్లం రెండూ తీపినిచ్చే పదార్థాలే. అయితే చక్కెర కంటే బ్లెలం మంచిదంటారు. ఇందుకు కారణమేంటీ? ఇంతకీ బెల్లంతో చేసిన ఆహార పదార్థాలకి ఎందుకంత గిరాకీ?

ఆరోగ్యమైన తీపిదనం!

చక్కెర, బెల్లం రెండూ తీపినిచ్చే పదార్థాలే. అయితే చక్కెర కంటే బ్లెలం మంచిదంటారు. ఇందుకు కారణమేంటీ? ఇంతకీ బెల్లంతో చేసిన ఆహార పదార్థాలకి ఎందుకంత గిరాకీ? 


  1. చెరకు రసంనుంచి తయారయ్యే చక్కెర, బెల్లం విషయానికొస్తే బెల్లంలో మంచి పోషకాలుంటాయి. సాధారణంగా మన దేశంలో పండుగ సమయాల్లో బెల్లం అన్నం, బెల్లం పాయసం, బెల్లంతో పిండి వంటలను చేస్తుంటారు. అంతెందుకు కడుపులో అజీర్తిగా ఉన్నా బెల్లం పానకం తాగుతుంటారు. కడుపులో మంటగా ఉన్నా, అసిడిటీ సమస్య ఉన్నా.. బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటే సరి. 
  2. బెల్లం, చక్కెర రెండింటిలో క్యాలరీలుంటాయి. చక్కెరలో న్యూట్రిన్లు ఉండవు. బెల్లంలో అలా కాదు. ఎన్నో పోషకాలుంటాయి. తిన్న తర్వాత వెంటనే శక్తినిస్తుంది. ముఖ్యంగా వేడి శరీరాన్ని చల్లబరుస్తుంది. అంటే శరీర ఉష్ణోగ్రతను బ్యాలెన్స్‌ చేస్తుంది. 
  3. ఆయుర్వేదశాస్త్రంలో బెల్లాన్ని రకరకాల మందుల్లో వాడుతారు. ఇందులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. రక్తాన్ని శుద్ధి పరుస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, జలుబు, తలనొప్పి లాంటి వాటిని దూరం చేసే గుణం ఇందులో ఉంది. చర్మ ఆరోగ్యానికి మంచిదే. చెరకు రసంతో చేసే బెల్లంతో పాటు తాటి బెల్లం, ఈత బెల్లం, కొబ్బరి బెల్లం కూడా ఆరోగ్యానికి మంచిదే. 

Updated Date - 2021-09-09T05:30:00+05:30 IST