Advertisement
Advertisement
Abn logo
Advertisement

చెయ్యేటిలో పశువుల కాపరి మృతి

రాజంపేట టౌన్‌, డిసెంబరు 4 : రాజంపేట చెయ్యేరు నదీ పరివాహక ప్రాంతంలో బాలరాజుపల్లెలో షేక్‌ సజ్జర్‌బాషా అనే పశువుల కాపరి మృతి చెందాడు. శుక్రవారం ఈయన పశువులను తోలుకొని వస్తుండగా కొన్ని పశువులు చెయ్యేటిలోకి వెళ్లడంతా వాటిని మళ్లించడానికి ఆయన చెయ్యేటిలోకి దిగారు. అక్కడ చెయ్యేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సజ్జర్‌బాషా గల్లంతై బుడుగుంట సమీపంలో మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడికి కుమారులు, కుమార్తెలు కలిసి మొత్తం నలుగురు, భార్య ఉన్నారు. ఇంటి పెద్ద మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.


రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి 


సికెదిన్నె, డిసెంబరు 4: రోడ్డు ప్రమాదంలో రామసుబ్బారెడ్డి (55) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఏఎ్‌సఐ నాగరాజు తెలిపారు. ఆయన అందించిన వివరాల మేరకు... చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తికి చెందిన రామసుబ్బారెడ్డి ఎద్దుల బండిలో ఇసుక తీసుకుని వస్తుండగా పబ్బాపురం క్రాస్‌ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో గాయపడిన రామసుబ్బారెడ్డిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. రామసుబ్బారెడ్డితో పాటు అతడి మనువడు మహేంద్రరెడ్డి కూడా బండిలో ఉన్నప్పటికీ అతను సురక్షితంగా బయటపడ్డారని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Advertisement
Advertisement