Abn logo
May 4 2021 @ 17:23PM

జమున హ్యాచరీస్‌‌ కేసులో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌: జమున హ్యాచరీస్‌ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మంగళవారం హైకోర్టు జమున హ్యాచరీస్‌ కేసును విచారణ చేపట్టింది. జమున హ్యాచరీస్‌కు సరైన పద్ధతిలో నోటీసులు సర్వ్ చేసి ప్రభుత్వం విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారం సమయం ఇవ్వాలని కోరింది. శుక్రవారం ఇచ్చి సోమవారం రిప్లై ఇవ్వమనేలా ఉండకూడదని షరతు విధించింది. వెనుక గేటు నుంచి కాదు.. రాచమార్గంలో వెళ్లి విచారణ జరపాలని ఆదేశించింది.  మే 1, 2వ తేదీల్లో జరిగిన విచారణను పరిగణనలోకి తీసుకోవద్దని చెప్పింది. ప్రభుత్వ నివేదిక చెల్లదని పేర్కొంది. అధికారులు ఉల్లంఘనకు పాల్పడినట్టు హైకోర్టు అభిప్రాయపడింది. ప్రతివాదులందరికీ హైకోర్టు నోటీసులు పంపించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

Advertisement
Advertisement
Advertisement