Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

అమరావతి: ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. నరేగా బిల్లులు చెల్లించకుండా జాప్యం చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే నెల 4న ఏపీ సీఎస్‌ హైకోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ఏపీ సీఎస్‌ నరేగా బిల్లుల చెల్లింపుపై పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంటుందని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. నరేగా బిల్లుల చెల్లింపులపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. 20శాతం మినహాయించుకుని బిల్లులను చెల్లిస్తున్నామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే పిటిషనర్ తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. తమకు బిల్లులు చెల్లించలేదని, విజిలెన్స్ విచారణ కూడా జరగడం లేదని పిటిషనర్‌ తరపు లాయర్లు తెలిపారు. ప్రతిసారీ విజిలెన్స్ విచారణ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటిమాటగా చెబుతూ అఫిడవిట్‌లు వేయకపోవడం ఏమిటని కోర్టు ప్రశ్నించింది. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement