Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘టీటీడీ’ నిర్ణయంపై హైకోర్టు సీరియస్

విజయవాడ: టీటీటీ పాలకమండలి సభ్యుల నియామకంపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. ప్రత్యేక ఆహ్వానితుల కోసం జారీ చేసిన జీవోను సస్పెండ్ చేసింది. టీటీటీ బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించారని వాదనలు జరిగాయి. టీటీడీ నిర్ణయం సామాన్య భక్తులపై ప్రభావం చూపుతుందని పిటిషనర్ల తరపు న్యాయవాది యలమంజుల బాలాజీ.. కోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు.. కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. అలాగే దీనిపై టీటీడీ, వైసీపీ ప్రభుత్వానికి కోర్టు.. నోటీసులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement