ఏజీ అభ్యర్థనతో నిధుల విడుదలపై స్టే ఎత్తివేసిన హైకోర్టు

ABN , First Publish Date - 2021-08-13T23:51:25+05:30 IST

ఏజీ అభ్యర్థనతో నిధుల విడుదలపై స్టే ఎత్తివేసిన హైకోర్టు

ఏజీ అభ్యర్థనతో నిధుల విడుదలపై స్టే ఎత్తివేసిన హైకోర్టు

హైదరాబాద్: జీవో 208పై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. 58 కోట్లు విడుదల చేయవద్దన్న ఆదేశాలను హైకోర్టు ఉపసంహరించింది. సవరించిన జీవో సమర్పించాలని ఇటీవల ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సీఎస్ సమర్పించిన అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఏజీ కోరింది. జీవో నేపథ్యాన్ని అఫిడవిట్‌లో సీఎస్ వివరించారని ఏజీ బీఎస్‌ ప్రసాద్ పేర్కొన్నారు. భూసేకరణ పరిహారం చెల్లింపుల కోసమే రూ.58 కోట్లు కేటాయించినట్లు ఏజీ తెలిపారు. ఏజీ అభ్యర్థనతో నిధుల విడుదలపై హైకోర్టు స్టే ఎత్తివేసింది. లెక్చరర్ ప్రభాకర్ పిల్ పై విచారణ ముగించినట్లు హైకోర్టు స్పష్టం చేసింది.

Updated Date - 2021-08-13T23:51:25+05:30 IST