అమెరికాను బ్రెజిల్‌ను దాటి వరుసగా రెండో రోజు రికార్డు కేసులు

ABN , First Publish Date - 2020-08-04T22:16:47+05:30 IST

అయితే ఇండియా మొదటి స్థానానికి రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. దేశంలో కేసులు పెరగడం ఒక కారణం అయితే అమెరికా, బ్రెజిల్‌ దేశాల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం మరో కారణం. అమెరికాలో కేసుల తగ్గుముఖం

అమెరికాను బ్రెజిల్‌ను దాటి వరుసగా రెండో రోజు రికార్డు కేసులు

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న దేశం ప్రస్తుతం ఇండియానే. ఇన్నాళ్లు అత్యధిక కేసులంటే అమెరికా, బ్రెజిల్‌ దేశాలు గుర్తుకు వచ్చేవి. తాజాగా వాటిని దాటి ఇండియా మొదటి స్థానంలోకి వెళ్లింది. సోమవారంనాడు విడుదలైన వివరాల ప్రకారం అమెరికా, బ్రెజిల్ కంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఇండియాలో కేసులు నమోదు అయ్యాయి. కాగా, మంగళవారం కూడా ఇదే పరంపర కొనసాగింది. అమెరికా, బ్రెజిల్ దేశాల కంటే ఇండియాలోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి.


అయితే ఇండియా మొదటి స్థానానికి రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. దేశంలో కేసులు పెరగడం ఒక కారణం అయితే అమెరికా, బ్రెజిల్‌ దేశాల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం మరో కారణం. అమెరికాలో కేసుల తగ్గుముఖం చాలా స్వల్ప స్థాయిలో ఉన్నప్పటికీ, బ్రెజిల్‌లో చాలా పెద్ద సంఖ్యలో తగ్గాయి. ఇటు ఇండియాలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. రోజూ 50 వేల కేసులకు పైగానే నమోదు అవుతున్నాయి.


ఈరోజు నమోదు అయిన వివరాల ప్రకారం.. ఇండియాలో కొత్తగా 52,050 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక అమెరికాలో 48,622 బ్రెజిల్‌లో 17,988 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్యలో ఇండియా మూడవ స్థానంలో ఉన్నప్పటికీ మరణాల సంఖ్యలో నాల్గవ స్థానంలో ఉండడం కాస్త ఊరటనిచ్చే అంశం. మొదటిసారి ఇండియాలో లాక్‌డౌన్ విధించిన నాటితో పోలిస్తే ప్రస్తుతానికి మరణాల రేటు శాతం చాలా వరకు తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఈరోజు ప్రకటించింది.

Updated Date - 2020-08-04T22:16:47+05:30 IST