ఆ కొండ ఎళ్లుగా మండుతోంది!

ABN , First Publish Date - 2020-12-23T05:30:00+05:30 IST

ఓ కొండ మండుతోంది. రోజులుగా, నెలలుగా కాదు. 6 వేల సంవత్సరాలుగా మండుతూనే ఉంది. ఇంతకీ ఆ కొండ ఎక్కడుంది? ఎందుకు మండుతోంది? ఆ విశేషాలు ఇవి

ఆ కొండ ఎళ్లుగా మండుతోంది!

ఓ కొండ మండుతోంది. రోజులుగా, నెలలుగా కాదు. 6 వేల సంవత్సరాలుగా మండుతూనే ఉంది. ఇంతకీ ఆ కొండ ఎక్కడుంది? ఎందుకు మండుతోంది? ఆ విశేషాలు ఇవి.

  • ఆస్ట్రేలియాలో మౌంట్‌ వింజెన్‌ అనే కొండ 6 వేల ఏళ్లుగా మండుతోంది. కొండ లోపలి భాగంలో 30 మీటర్ల లోపల ఉన్న బొగ్గు అంటుకుని మండుతూనే ఉంది. 
  • నిరంతరాయంగా మండుతూనే ఉండటం వల్ల ఈ కొండకు బర్నింగ్‌ మౌంటెన్‌ అని పేరు స్థిరపడింది. బొగ్గు గనుల్లో నిప్పు అంటుకుని రోజుల తరబడి మండటం సాధారణంగా జరిగేదే. కానీ ఇలా ఏళ్ల తరబడి మండుతున్న బొగ్గు గని ఇదే.
  • ఈ బొగ్గు గని ఎలా అంటుకుంది అన్నది ఎవ్వరికీ తెలియదు. పిడుగు పడటం వల్ల లేదా బుష్‌ఫైర్‌ వల్ల అంటుకుని ఉంటుందని భావిస్తున్నారు.
  • భూగర్భం లోపల నిప్పు రాజుకోవడం వల్ల దాని ప్రభావం ఆ చుట్టుపక్కల వ్యవసాయంపై పడింది. అయితే ఆ ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

Updated Date - 2020-12-23T05:30:00+05:30 IST