పోలీసుల మానవత్వం

ABN , First Publish Date - 2021-05-18T07:35:54+05:30 IST

నిరాశ్రయిరాలైన మహిళకు పోలీసులు ఆర్థికసాయం అందించి మానవత్వం చాటారు.

పోలీసుల మానవత్వం
ఆర్థికసాయం అందజేస్తున్న స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పోలీస్‌ సిబ్బంది

 నిరాశ్రయిరాలైన మహిళకు ఆర్థికసాయం

మునగాల, మే 17:  నిరాశ్రయిరాలైన మహిళకు పోలీసులు ఆర్థికసాయం అందించి మానవత్వం చాటారు. మండల పరిధిలోని విజయరాఘవపురం గ్రామా నికి చెందిన పస్తం భారతి అనే మహిళ భర్త కొంతకాలం క్రితం అకాల మృతి చెందాడు. భారతి  తన పిల్లలతో గుడిసెలో నివసిస్తోంది. ఇటీవల జరిగిన అగ్ని ప్రమా దంలో గుడిసె కాలిపోగా, ఇంటి సామగ్రి కూడా అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న తెలంగాణ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పోలీస్‌ సభ్యుడు ఖమ్మంపాటి సో మయ్య, తన తోటి సిబ్బందితో  రూ.25 వేలు విరాళాలు సేకరించి ఆ చెక్కును సర్పంచ్‌ రేపల్లె యశోద, గ్రామపెద్దల సమక్షంలో సోమవారం అందజేశారు. కార్యక్ర మంలో కత్తి శ్రీను, అమర్‌నాథ్‌, అజయ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-18T07:35:54+05:30 IST