ఆదర్శప్రాయుడు శ్రీకృష్ణదేవరాయులు

ABN , First Publish Date - 2021-01-18T05:25:24+05:30 IST

భారతదేశాన్ని పాలించిన చక్రవర్తు ల్లో గొప్ప చక్రవర్తిగా, ఆదర్శప్రాయుడుగ్చా శ్రీకృష్ణదేవరాయలు చరిత్రలో నిలిచారని బలిజ అభ్యుదయ సేవా సమితి ‘బాస్‌’ అధ్యక్షుడు దాసరి శివప్రసాద్‌ కొనియాడారు.

ఆదర్శప్రాయుడు శ్రీకృష్ణదేవరాయులు
శ్రీకృష్ణదేవరాయులు విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న బలిజ సంఘం నేతలు

కడప (మారుతీనగర్‌), జనవరి 17:భారతదేశాన్ని పాలించిన చక్రవర్తు ల్లో గొప్ప చక్రవర్తిగా, ఆదర్శప్రాయుడుగ్చా శ్రీకృష్ణదేవరాయలు చరిత్రలో నిలిచారని బలిజ అభ్యుదయ సేవా సమితి ‘బాస్‌’ అధ్యక్షుడు దాసరి శివప్రసాద్‌ కొనియాడారు. శ్రీకృష్ణదేవరాయలు జయంతిని పురస్కరించుకుని బలిజ అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో దాసరి శివప్రసాద్‌ ఆదివారం స్థానిక నకాష్‌ నుంచి వైవీ స్ర్టీట్‌ మీదుగా కృష్ణసర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కృష్ణసర్కిల్‌లో గల శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పా లాభిషేకం, పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు అత్యం త ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవ ర్తిగా కీర్తి గడించారన్నారు. ప్రతియేటా ఆయన జయంతిని ఘనంగా నిర్వహించడమే కాకుండా నగరంలో రాయల భవన్‌ కూడా నిర్మించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ప్రతి బలిజ సోదరుడు ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమితి నాయకులు ఏనుగుల సుబ్బయ్య, బలిజ సంఘం రాష్ట్ర నా యకులు చెన్నంశెట్టి మురళి, బండిబాబు, ఆదినారాయణ, మణి, శ్రీకాంత్‌, శివరాయల్‌, వెంకీ, రామసుబ్బయ్య, ప్రశాంత్‌, బాబురాయల్‌, మధుసూదన్‌, మిర్యాల సురేఖ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-18T05:25:24+05:30 IST