Abn logo
Sep 26 2021 @ 02:18AM

ఆదర్శ నేత చంద్రబాబు

టీడీపీ అధినేతపై పీహెచ్‌డీ చేసిన గన్నవరం యువకుడు


విజయవాడ, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఆత్కూరు గ్రామానికి చెందిన సొంగా దేవదాస్‌ పీహెచ్‌డీ చేశారు. జార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీలో స్థిరపడిన దేవదాస్‌ రాజస్థాన్‌కు చెందిన ఏపీజేఎస్‌ యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తిచేశారు. పీహెచ్‌డీలో ‘నారా చంద్రబాబునాయుడు-ఎ రోల్‌ మోడల్‌’ అంశంపై పరిశోధనాత్మక పత్రాలను సమర్పించి పట్టా పొందారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి చంద్రబాబును కలుస్తానని దేవదాస్‌ తెలిపారు.