పచ్చదనం ప్రాధాన్యతను గుర్తించాలి

ABN , First Publish Date - 2021-07-25T04:15:00+05:30 IST

పచ్చదనం ప్రాధా న్యతను ప్రతీ ఒక్కరు గు ర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి ని రంజన్‌రెడ్డి అన్నారు.

పచ్చదనం ప్రాధాన్యతను గుర్తించాలి
మొక్క నాటి నీరు పోస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి

- వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 


వనపర్తి అర్బన్‌, జూలై 24 : పచ్చదనం ప్రాధా న్యతను ప్రతీ ఒక్కరు గు ర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి ని రంజన్‌రెడ్డి అన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ జ న్మదినం సందర్భంగా వ నపర్తి జిల్లా కేంద్రంలోని 8వ వార్డులో శనివారం మంత్రి మొక్కలు నాటా రు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ ప్రస్తు తం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్లు పూర్తిస్థాలయిలో నిండి, భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. దీంతో తేమశాతం ఎక్కువై మొక్కలు కూడా పెరుగతాయని చె ప్పారు. ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి దేశంలోనే కాక ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు సా ధించిందని మంత్రి అన్నారు. మునిసిపాలిటీ పరిధిలోని శ్రీనివాస్‌పూర్‌, 8వ వార్డుల్లో కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా మంత్రితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం శ్రీనివాస్‌పూర్‌లో కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా మం త్రి కేక్‌ కట్‌ చేశారు. కలెక్టర్‌ సీవీ రామన్‌ కళాశాల ఆవరణలో, ఏకోపార్క్‌లో మొక్కలు నాటారు. కార్యక్రమం లో ఎస్పీ అపూర్వారావు, ఏఎస్పీ షాకీర్‌ హుస్సేన్‌, అదనపు కలెక్టర్‌ అంకిత్‌, ఆర్‌డీవో అమరేందర్‌, ఫారెస్ట్‌ క న్సర్వేటర్‌ క్షితిజ, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిటీ శ్రీధర్‌, డీఎఫ్‌వో రా మకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T04:15:00+05:30 IST