అమెరికాలో మనోళ్ల హవా

ABN , First Publish Date - 2021-08-26T09:48:09+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో ప్రవాస భారతీయులు సత్తాచాటుతున్నారు. కుటుంబ సంపాదన, కాలేజీ విద్యలో ఆ దేశ జనాభా సగటుతో పోల్చితే మనోళ్లు చాలా ముందంజలో ఉన్నారు. అ

అమెరికాలో మనోళ్ల హవా

విద్య, సంపాదనలో భారతీయుల సత్తా 

వాషింగ్టన్‌, ఆగస్టు 25: అగ్రరాజ్యం అమెరికాలో ప్రవాస భారతీయులు సత్తాచాటుతున్నారు. కుటుంబ సంపాదన, కాలేజీ విద్యలో ఆ దేశ జనాభా సగటుతో పోల్చితే మనోళ్లు చాలా ముందంజలో ఉన్నారు. అమెరికాలో ఎన్‌ఆర్‌ఐల సగ టు కుటుంబ సంపాదన రూ.91.83 లక్షలు. అమెరికన్ల సగటు కుటుంబ సంపాదన(రూ.47.45 లక్షలు) కంటే భారతీయుల ఆదాయం రెండింతలు! అమెరికాలో విద్య, కుటుంబ ఆదాయంపై న్యూయార్క్‌ టైమ్స్‌ ఓ కథనం ప్రచురించింది. దీని ప్రకారం అమెరికాలో 40 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో 16 లక్షల మంది వీసాదారులు. 14 లక్షల మంది శాశ్వత పౌరసత్వం గలవారు. మరో 10 లక్షల మంది ఆ దేశంలో జన్మించిన వారు ఉన్నారు. 



అమెరికాలో కాలేజీ గ్రాడ్యుయేట్లు 34% ఉండగా, భారతీయుల సగటు 79%. అమెరికాలో నివసిస్తున్న ఆసియా దేశాల వారితో పోల్చితే సంపాదనలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నా రు. సగటు కుటుంబ సంపాదనలో భారతీయుల తర్వాతి స్థానాల్లో తైవానీయులు(రూ.72.11 లక్షలు), ఫిలిప్పీన్లు (రూ.70.33 లక్షలు) నిలిచారు. జాతీయ సగటు కుటుంబ సంపాదన (రూ.47.45 లక్షలు)తో పోలిస్తే కేవలం 14% మంది ఎన్‌ఆర్‌ఐల ఆదాయం(రూ.29.69 లక్షలు) తక్కువగా ఉంది. అత్యధిక వేతనాలు ఇచ్చే ఐటీ, ఆర్థిక, వైద్య రంగాల్లో ప్రవాస భారతీయులు సత్తా చాటుతున్నారు. అమెరికా వైద్యుల్లో భారత సంతతి వారు 9% మంది ఉన్నారు. మొత్తమ్మీద 50% మందికి పైగా వలసదారులు ఉన్నారు. 


Updated Date - 2021-08-26T09:48:09+05:30 IST