Abn logo
Sep 26 2021 @ 22:24PM

భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలి

రెబ్బెనలో మాట్లాడుతున్న అఖిలపక్షం నాయకులు

రెబ్బెన, సెప్టెంబరు 26: కేంద్ర ప్రభు త్వవిధానాలకు నిరసనగా సోమవారం చేపట్టే భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి బోగేఉపేందర్‌, ఇఫ్టూ అధ్యక్షుడు బండారి తిరుపతి అన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పేదలపై పెనుభారం మోపే విధంగా పన్నులు వసూలు చేస్తోందన్నారు. నిత్యవసర వస్తువులపై అధిక ధరలు పెంచిందన్నారు. ఈ విష యాలన్నింటిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు భారత్‌బంద్‌ కార్యక్రమాన్ని చేపడుతు న్నట్టు పేర్కొన్నారు. అన్ని సంస్థలు, దుకాణాల వారు, చిరువ్యాపారులు ఈ బంద్‌లో పాల్గొనాలని కోరారు. సమావేశంలో ఏఐటీ యూసీ బ్రాంచ్‌కార్యదర్శి ఆశోక్‌, సహాయకార్యదర్శి సాగర్‌గౌడ్‌, ఇఫ్ట్‌ఏరియా కోశాధికారి అరికిల్లపోశం, నాయకులు రాజేష్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు. 

దహెగాం:  మండలకేంద్రంలో ఆదివారం ఏర్పా టు చేసిన సమావేశంలో టీఏజీఎస్‌ జిల్లా ఉపాధ్య క్షుడు కోట శ్రీనివాస్‌ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలను చేపడుతోందని సామా న్యుడు బతకలేని పరిస్థితి దాపురించింద న్నారు. ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా భారత్‌ బంద్‌ కార్యక్రమాన్ని చేపట్టినట్టు పేర్కొన్నారు. ఇందుకు అంతా సహకరించాలని కోరారు.