Abn logo
Sep 25 2021 @ 01:04AM

భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న ముత్యంరావు

- సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముత్యంరావు

కళ్యాణ్‌నగర్‌, సెప్టెంబరు 24: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 27న తలపెట్టిన భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముత్యంరావు పిలుపునిచ్చారు. శుక్రవారం గోదావరిఖని శ్రామిక భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని, రైతులు తొమ్మిది నెలలుగా నిరసన తెలుపుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్మిక చట్టాలను మారుస్తూ వ్యవసాయ రంగంలో నూతన చట్టాలను తీసుకువస్తూ కార్మికులను, రైతులను పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 20న జరిగే భారత్‌ బంద్‌కు అందరు మద్దతు తెలుపాలని కోరారు. వేల్పుల కుమారస్వా మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు మెండె శ్రీనివాస్‌, జ్యోతి, రామాచారి, కొమురయ్య పాల్గొన్నారు.