Abn logo
Sep 27 2021 @ 00:52AM

భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలి

జిల్లా కేంద్రంలో ద్విచక్రవాహన ర్యాలీని నిర్వహిస్తున్న నాయకులు

- పలుచోట్ల బంద్‌కు మద్దతుగా వివిధ సంఘాల బైక్‌ ర్యాలీలు   

- కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

పెద్దపల్లి కల్చరల్‌, సెప్టెంబరు 26 : సోమవారం జరిగే భారత్‌ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పెద్దపల్లిలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వ ర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్య ఉపాద్యాయ సంఘాల నాయకులు గోల్కోండ శ్రీధర్‌ మాట్లాడుతూ గత సంవత్సరం నవంబర్‌ 26 నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు మూడు చట్టా లను రద్దు చేయాలని, భారత సరిహద్దు ప్రాంతాల్లో రైతులు నిరవధిక నిరాహర దీక్ష చేస్తున్నారని ఈ చట్టాల వల్ల రైతులు తమ పంటపోలాల్లో కూలీగా మారే అవకాశాలు ఉన్నాయన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పోరేటీకరణ చేసే దశకు అడుగులు వేస్తోందని, ఇప్పటికే ప్రభుత్వ రంగానికి సంభందించిన రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఉక్కు ప్రయివేటికరణ చేశా రని ఆరోపించారు. ఈ మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని అఖిల భారత వ్యవసాయ సంఘం 27న ప్రకటించిన భారత్‌ బంద్‌ పిలుపుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు, కార్మికులు సహకరించాలని అన్నా రు. ఉపాధ్యాయ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి బస్టాండ్‌ నుంచి నూతన కలెక్టర్‌ కార్యాలయం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సంతోష్‌, లక్ష్మణ్‌, దామోదర్‌రెడ్డి, అశోక్‌ఖరెడ్డి, సారయ్య, సతీష్‌, శ్రీనివాస్‌, తిరుపతి, సరేందర్‌, విష్ణు, అనిల్‌రెడ్డి, సత్యనారాయణ, ప్రణయ్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.