Abn logo
Sep 25 2021 @ 23:35PM

భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలి

మాట్లాడుతున్న డీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి

కరీంనగర్‌ అర్బన్‌, సెప్టెంబరు25: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొరే టీకరణ విధానాలకు వ్యతిరేకంగా  సోమ వారం తలపెట్టిన భారత్‌బంద్‌ను విజయ వంతం చేయాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. డీసీసీ కార్యాలయంలో శనివారం జిల్లా కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి అధ్యక్షతన భారత్‌బంద్‌ సన్నాహక సమా వేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ నాయకులతో పాటు సీపీఎం, సీపీఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, న్యూడెమోక్రసీ పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ  10 నెలలుగా రైతులు ఢిల్లీ సరిహద్దులో రైతులు  ఉద్యమిస్తున్నా ప్రధాని మోదీ  నిమ్మకు నీరెత్తి నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ సమావేశంలో సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంబటిజోజిరెడ్డి, టీపీసీసీ నాయకులు రహమత్‌ హుస్సేన్‌, సీపీఐ సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్‌, సీపీఎం కార్యదర్శి జీ ముకుందరెడ్డి, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి,   సీపీఎం నాయకులు గుడికందుల సత్యం, సీఐటీయూ అధ్యక్షులు శ్రీనివాస్‌, కార్యదర్శి రమేష్‌, భాస్కర్‌, సదాశివ, ఏఐఎస్‌ఎఫ్‌ పట్టణ అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, రైతుసంఘం నాయకులు పాల్గొన్నారు.

రామడుగు: రామడుగు మండల కేంద్రంలో భారత్‌ బంద్‌ వాల్‌ పోస్టర్లను శనివారం విడుదల చేశారు. ఈకార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్‌, మండల కార్యదర్శి ఉమ్మెంతుల రవీందర్‌రెడ్డి, జిల్లా కౌన్సిల్‌ సభ్యులు మచ్చ రమేష్‌, బోనగిరి మహేందర్‌ పాల్గొన్నారు.

చిగురుమామిడి: భారత్‌ బంద్‌ను విజయ వంతం చేయాలని అఖిల పక్షం నాయకులు సీపీఐ మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డిలు అన్నారు. శనివారం మండల కేంద్రంలో విలేకరుల సమా వేశంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు చిట్టు మల్ల రవీందర్‌, వంగర మల్లేశం, రైతు సంఘం అధ్యక్షుడు అందె స్వామి, బీసీ సెల్‌ మండల అధ్యక్షుడు కోనేటి రాములు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాజయ్య,  పాల్గొన్నారు. 

వీణవంక: భారత్‌బంద్‌ను విజయ వంతం చేయాలని అఖిలపక్ష నాయ కులు అన్నారు. శనివారం మండల కేంద్రంలో వారు విలేకరులతో మాట్లా డారు. ఈకార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు సాహెబ్‌హుస్సేన్‌, అంబాల మహేష్‌, జనార్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

ఇల్లందకుంట: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించే భారత్‌బంద్‌ను జయప్రదం చేయాలని అఖిల పక్షాల నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం మండల కేంద్రంలో జరిగిన  అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ నాయకుడు పెద్ది కుమార్‌, సీపీఎం నాయకులు వాసుదేవారెడ్డి, రామారావు తదితరులు పాల్గొన్నారు.

గన్నేరువరం: భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని సీసీఐ మండల కార్యదర్శి కాంతాల అంజిరెడ్డి పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి చొక్కల శ్రీశైలం, నాయకులు గర్శకుర్తి శ్రీనివాస్‌, రాము, అంజిరెడ్డి, రాజిరెడ్డి, ఎల్లారెడ్డి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.