ప్రతిపాదనలతో సరి!

ABN , First Publish Date - 2021-04-20T04:45:53+05:30 IST

టెక్కలి డివిజన్‌లో పారిశ్రామికవాడల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన నీలిరంగు గ్రానైట్‌ పరిశ్రమ, తీరప్రాంతంలో మత్స్యసంపద సంరక్షణకు కోల్డ్‌స్టోరేజ్‌లు, ఉద్దానంలో జీడి, కొబ్బరి పరిశ్రమలు, మైదాన ప్రాంతాల్లో మామిడి ఎగుమతులు... ఇలా వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని టెక్కలి డివిజన్‌లో పారిశ్రామిక వాడలు(ఇండస్ర్టీయల్‌ పార్క్‌) ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం భావించింది. టెక్కలి, మెళియాపుట్టి, రామకృష్ణాపురం, ఇచ్ఛాపురం సమీపాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ప్రతిపాదనలతో సరి!
టెక్కలి సమీపంలో పారిశ్రామిక వాడ కోసం గుర్తించిన స్థలం

కలగానే మిగిలిన పారిశ్రామికవాడలు
 నిధులు కేటాయించని ఏపీఐఐసీ
(టెక్కలి)

టెక్కలి డివిజన్‌లో పారిశ్రామికవాడల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన నీలిరంగు గ్రానైట్‌ పరిశ్రమ, తీరప్రాంతంలో మత్స్యసంపద సంరక్షణకు కోల్డ్‌స్టోరేజ్‌లు, ఉద్దానంలో జీడి, కొబ్బరి పరిశ్రమలు, మైదాన ప్రాంతాల్లో మామిడి ఎగుమతులు... ఇలా వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని టెక్కలి డివిజన్‌లో పారిశ్రామిక వాడలు(ఇండస్ర్టీయల్‌ పార్క్‌) ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం భావించింది. టెక్కలి, మెళియాపుట్టి, రామకృష్ణాపురం, ఇచ్ఛాపురం సమీపాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటి  ద్వారా ప్రాంతాల్లో వందలాది మందికి ఉపాధి కల్పించాలని భావించింది. మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుతో పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుందని భావించి 2017లో ఆ ప్రాంతాల్లో భూ సేకరణకు రెవెన్యూ అధికారులు ముందుకువచ్చారు. అప్పటి జేసీ చక్రధర్‌బాబు, ఆర్డీవో ఎం.వెంకటేశ్వరరావు, పరిశ్రమల శాఖకు సంబంధించిన పలువురు అధికారులు దపదఫాలుగా ఆ ప్రాంతాల్లో పర్యటించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించారు.  
- టెక్కలి ప్రాంతంలో గ్రానైట్‌ క్వారీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మేఘవరం పంచాయతీ పరిధి సర్వేనెం.1లో 50 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. గ్రానైట్‌ క్వారీల్లో లభించే వేస్ట్‌మెటీరియల్‌తో క్రషర్స్‌, గృహ అవసరాలకు అవసరమయ్యే సామగ్రి, గ్రానైట్‌ కటింగ్‌ అండ్‌ పాలిషింగ్‌ యూనిట్లు తదితర రకాలు పారిశ్రామిక హబ్‌లో ఏర్పాటుకు అవకాశం ఉందని భావించారు.
- పలాస మండలం రామకృష్ణాపురం వద్ద 30 ఎకరాలు, మెళియాపుట్టి వద్ద 70 ఎకరాలు గుర్తించారు. ఏపీఐఐసీ ద్వారా ముందుగా లేఅవుట్లు వేసి, తరువాత రోడ్లు, డ్రైన్లు, విద్యుత్‌, నీటి సదుపాయాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి ఇండస్ట్రీయల్‌ పార్క్‌ ఏర్పాటుకు సిద్ధమయ్యారు.
- టెక్కలి సమీపంలోని అడ్డుకొండ ప్రాంతాన్ని రెవెన్యూ, పరిశ్రమలశాఖ అధికారులు దపదఫాలుగా పరిశీలించారు. ఈ ప్రాంతాల్లో పారిశ్రామిక హబ్‌లు ఏర్పాటు కోసం నాలుగేళ్ల కిందట ప్రతిపాదనలు చేశారు. దీంతో చాలామంది యువత తమకు ఉపాధి లభిస్తుందని ఎదురుచూశారు. కానీ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించకపోవడంతో ప్రతిపాదనలు  కార్యరూపం దాల్చడం లేదు. మరోవైపు ఏపీఐఐసీ నిధులు కేటాయించడం లేదు. దీంతో పారిశ్రామిక వేత్తలు, యువత నిరాశ చెందుతున్నారు.


భూములు గుర్తించాం
పారిశ్రామిక వాడల ఏర్పాటుకు అవసరమైన భూములను గుర్తించాం. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఏపీఐఐసీ నుంచి అవసరమైన నిధులు కేటాయింపులో జాప్యమవుతోంది. మరోసారి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
- రామకృష్ణ, ఐవోపీ

Updated Date - 2021-04-20T04:45:53+05:30 IST