Advertisement
Advertisement
Abn logo
Advertisement

తమ్ముడి బర్త్‌డే‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలనుకుంది.. ఆఫీస్ నుంచి త్వరగా బయలుదేరింది.. అంతలోనే ఘోరం జరిగిపోయింది!

ఆమె ఒక న్యూస్ యాంకర్.. ఓ ప్రముఖ ఛానెల్‌లో పని చేస్తోంది.. బుధవారం ఆమె తమ్ముడి జన్మదినోత్సవం.. అతని బర్త్‌డే‌ను ఘనంగా సెలబ్రేట్ చేయాలనుకుంది.. అందుకు అన్ని ఏర్పాట్లూ చేసింది.. ఆఫీస్‌ నుంచి త్వరగా ఇంటికి బయలుదేరింది.. అయితే మార్గమధ్యంలో ఓ ఆయిల్ ట్యాంకర్ కింద పడి ప్రాణాలు కోల్పోయింది.. దీంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి.. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


రాయ్‌పూర్‌లోని ఓ వార్త ఛానెల్‌లో మహిమా శర్మ అనే యువతి న్యూస్ యాంకర్‌గా పని చేస్తోంది. తన డబ్బులతో బుధవారం తమ్ముడి బర్త్ డే‌ను ఘనంగా సెలబ్రేట్ చేయాలనుకుంది. అందుకు తగిన ఏర్పాట్లన్నీ చేసింది. రోజుంతా ఆఫీస్‌లో ఉల్లాసంగా గడిపింది. ఆఫీస్ నుంచి ఇంటికి ముందుగా బయలుదేరింది. స్కూటీ మీద వెళ్తూ పట్టు తప్పి కింద పడిపోయింది. వెనుక వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఆమె మీద నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె రాక కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు విషయం తెలుసుకుని తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement