ఆరేళ్ళు అయినా పూర్తికాని కర్వెన రిజర్వాయర్‌ ప్రాజెక్టు

ABN , First Publish Date - 2020-06-03T09:59:09+05:30 IST

ఆరేళ్ళు అయినా కర్వెన రిజర్వాయర్‌ ప్రాజెక్టు పనులు కనీసం 35 శాతం పనులు కూడా పూర్తి కాలేవని మాజీ మంత్రి, ఎఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి

ఆరేళ్ళు అయినా పూర్తికాని కర్వెన రిజర్వాయర్‌ ప్రాజెక్టు

దక్షిణ తెలంగాణ పై ప్రభుత్వం చిన్నచూపు... చిన్నారెడ్డి

కర్వెన ఫైలాన్‌ వద్ద మాజీ మంత్రి చిన్నారెడ్డి, జీఎంఆర్‌ను అరెస్టు చేసిన పోలీసులు 


భూత్పూర్‌, జూన్‌ 2:- ఆరేళ్ళు అయినా కర్వెన రిజర్వాయర్‌ ప్రాజెక్టు పనులు కనీసం 35 శాతం పనులు కూడా పూర్తి కాలేవని మాజీ మంత్రి, ఎఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి ఆరోపించారు. కాగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో చేపట్టిన కృష్ణ జలాల పరిరక్షణ దీక్ష కార్యక్రమంలో భాగంగా  మంగళవారం కర్వెన ఫైలాన్‌ వద్ద తీక్షకు వెళ్ళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. అంతకు ముందు కాంగ్రెస్‌ పార్టీ దేవరకద్ర నియోజవర్గ ఇంచార్జి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి మధుసూధన్‌ రెడ్డిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి భూత్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు.


ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో వారు నిరసన వ్వక్తం చేశారు. అనంతరం విలేకరులతో మాజీ మంత్రి చిన్నారెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హయంలోనే తెలంగాణలో 4 ప్రాజెక్టులు వంద శాతం పూర్తి చేయడం జరిగిందని అన్నారు. రూ.75 కోట్లతో కర్వెన రిజర్వాయర్‌ నిర్మాణం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి కేసిఆర్‌ గొప్పలు చెప్పి నేడు కనీసం 6వేల కోట్లు కూడా కర్చుచేయలేక ప్రాజెక్టు నిర్మాణాన్ని పెండ్నింగ్‌లో పెట్టారని విమర్శించారు. అంతే కాకుండా లక్ష్మీదేవిపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టుకు ఇంతవరకు అసలు టెండర్లు పిలువ లేదని చెప్పారు. ప్రాజెక్టులు పూర్తి అయ్యే వరకు కుర్చీ వేసుకొని కూర్చుంటానన్న ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి కూడా అటువైపు కనిపించలేరని చిన్నారెడ్డి దుయ్యాబట్టారు. కేసిఆర్‌  రోజా దావత్తుకు వెళ్ళి ఆంద్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి తో లోపాయకారం ఒప్పందం కుదుర్చుకొని పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు నీటిని తరలించేందుకు జీఓ నెంబరు 203ను అమలులోకి తీసుకొచ్చారని మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆరోపించారు. నల్లగొండ, పాలమూరు జిల్లాలకు కనీసం తాగు నీరు కూడ దొరకని పరిస్థితి ఏర్పాడుతుందని స్పష్టం చేశారు.  కేవలం ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాలేదని 12వందల మంది విద్యార్థులు ప్రాణాలు బలిదానం చేస్తే చలించిపోనా సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటు త్యాగం చేశారని అన్నారు.


ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్‌ నాయకురాలు బాలమణెమ్మ, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహ్మరెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకులు హర్యానాయక్‌, గోవర్దన్‌గౌడ్‌, ఎండీ. షాదిక్‌, మాదవరెడ్డి, మన్నెమయ్య, గడ్డం. యాదయ్య, ఎంపీటీసీ ఊశన్న, అబ్బుబాకర్‌, వీరితో పాటు మరో వంద మంది కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తదితరులు  పాల్గొన్నారు.


Updated Date - 2020-06-03T09:59:09+05:30 IST