మార్కెట్‌ రారాజులు..ఈ స్మార్ట్‌ వాచీలు

ABN , First Publish Date - 2021-01-02T06:25:05+05:30 IST

యాపిల్‌ వాచ్‌ సిరీ్‌సలో ఇది ఆరోది. అయిదో వాచ్‌కు స్వల్పంగా మార్పులు చేర్పులతో దీన్ని మార్కెట్లోకి తీసుకువచ్చారు. అన్నివేళలా అల్టీమీటర్‌కు తోడు రక్తంలో ఆక్సిజన్‌ను తెలుసుకునే సదుపాయం ఉంది

మార్కెట్‌ రారాజులు..ఈ స్మార్ట్‌ వాచీలు

యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 6

యాపిల్‌ వాచ్‌ సిరీ్‌సలో ఇది ఆరోది. అయిదో వాచ్‌కు స్వల్పంగా మార్పులు చేర్పులతో దీన్ని మార్కెట్లోకి తీసుకువచ్చారు. అన్నివేళలా అల్టీమీటర్‌కు తోడు రక్తంలో ఆక్సిజన్‌ను తెలుసుకునే సదుపాయం ఉంది. రెడ్‌ వేరియంట్‌ సహా వివిధ రంగుల్లో ఇది లభ్యమవుతోంది. సోలో లూప్‌, సోలో బ్రెయిడెడ్‌ లూప్‌ స్ట్రాప్‌లను కూడా పరిచయం చేసింది. 


శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌ 3

ఈ వాచ్‌లో గేమ్‌కు శాంసంగ్‌ సంప్రదాయ డిజైన్‌ ఉండేలా చూసింది. ఎక్కువ మంది వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. పాతవాటితో పోల్చుకుంటే స్పెసిఫికేషన్స్‌ మెరుగ్గా ఉన్నాయి. రక్తంలో ఆక్సిజన్‌ శాతాన్ని తెలుసుకునే సదుపాయానికి తోడు సామర్ధ్యం కలిగిన బ్యాటరీని ఉంచింది. మన దేశంలో ఈ వాచీ రూ.30,000కే లభ్యమవుతుంది. 


అమేజ్‌ఫిట్‌ జిటిఆర్‌ 2

బడ్జెట్‌ పరిధిలో లభ్యమయ్యే ఫిట్‌నెస్‌ వాచ్‌ అంటే ఇదే. రూ.12,999 కే స్పోర్ట్‌ ఎడిషన్‌ లభ్యమవుతుంది. క్లాసిక్‌ ఎడిషన్‌ రేటు మాత్రం రూ.13,499.  ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌ యాక్సెసరీలు అన్నీ ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ 5.0 అంతకు మించిన వాటికి పోటీపడి కూడా పని చేసేలా ఉన్నాయి. ఆన్‌బోర్డ్‌ జిపిఎ్‌సకు తోడు 50 మీటర్ల వరకు వాటర్‌ రెసిస్టెంట్‌. 


ఫిట్‌బిట్‌ వెర్సా 3

ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌లో బలంగా ఉపయోగపడే వాచీ ఇది. ఫిట్‌నెస్‌ స్పృహ ఎక్కువగా ఉండే వ్యక్తులకు ప్రయోజనకరంగా దీన్ని రూపొందించారు. స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ వంటి సదుపాయాలు లేనప్పటికీ ఫిట్‌నె్‌సకు సంబంధించి హార్డ్‌కోర్‌ హార్డ్‌వేర్‌గా దీన్ని చెప్పవచ్చు. దాదాపుగా రూ.19,000కి దీన్ని పొందవచ్చు. 



ఎంఐ వాచ్‌ రివాల్వ్‌

1.39 ఇంచుల డిస్‌ప్లేకు తోడు రెండు వారాల మేరకు బ్యాటరీ లైఫ్‌ దీని సొంతం. గొరెల్లా గ్లాస్‌ 3 భద్రత ఉంది. రూ.పదివేలకే లభ్యమవుతుంది. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వేరియంట్‌తో 110 వాచ్‌ ఫేస్‌లతో ఇది అందుబాటులో ఉంది.

Updated Date - 2021-01-02T06:25:05+05:30 IST