కొవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చేసింది

ABN , First Publish Date - 2021-01-14T05:39:05+05:30 IST

యి. జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు, డీఎంహెచ్‌వో చంద్రనాయక్‌, వైద్యసిబ్బంది, పోలీసుల సమక్షంలో ప్రత్యేక వాహనంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ను తీసుకువచ్చారు. వీటిని జిల్లా వైద్యఆరోగ్య కేంద్రంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో నిర్దేశిత ఉష్ణోగ్రతలో భద్రపరిచారు. నిరంతరం నిఘా ఉండేలా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. వ్యాక్సిన్‌ దించిన దగ్గర నుంచి భద్రపరిచేంత వరకూ జేసీ శ్రీనివాసులు పర్యవేక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కొవిడ్‌ బాధితులకు సేవలు అందించిన వైద్యసిబ్బందికి మొదటిగా వ్యాక్సినేషన్‌ చేయాలని ప్రభుత్వం

కొవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చేసింది
వ్యాక్సిన్‌ను పరిశీలిస్తున్న జేసీ శ్రీనివాసులు




 తొలివిడతగా జిల్లాకు 2,650 టీకాలు

 నిల్వ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

 16న వ్యాక్సినేషన్‌ : జేసీ శ్రీనివాసులు

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జనవరి 13: ఎట్టకేలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ జిల్లాకు వచ్చింది. మొత్తం 2,650 టీకాలు పటిష్ట బందోబస్తు మధ్య బుధవారం మధ్యాహ్నం జిల్లాకేంద్రానికి చేరాయి. జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు, డీఎంహెచ్‌వో చంద్రనాయక్‌, వైద్యసిబ్బంది, పోలీసుల సమక్షంలో ప్రత్యేక వాహనంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ను తీసుకువచ్చారు. వీటిని జిల్లా వైద్యఆరోగ్య కేంద్రంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో నిర్దేశిత ఉష్ణోగ్రతలో భద్రపరిచారు. నిరంతరం నిఘా ఉండేలా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. వ్యాక్సిన్‌ దించిన దగ్గర నుంచి భద్రపరిచేంత వరకూ జేసీ శ్రీనివాసులు పర్యవేక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.  ‘కొవిడ్‌ బాధితులకు సేవలు అందించిన వైద్యసిబ్బందికి మొదటిగా వ్యాక్సినేషన్‌ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. 

ఇందులో భాగంగా జిల్లాకు తొలివిడతగా 2,650 కొవిడ్‌ వ్యాక్సిన్లు  చేరుకున్నాయి. వీటి ద్వారా 26,500 మందికి డోసులు వేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే ఫేజ్‌-1లో 21,980 మంది వైద్యసిబ్బందిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశాం. వ్యాక్సిన్‌ నిల్వచేసేందుకు జిల్లాలో 18 కేంద్రాలను ఎంపిక చేశాం.  వినియోగంపై సంబంధిత సిబ్బందికి ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చాం. ఈ నెల 16న ప్రశాంత వాతావరణంలో 18 కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్‌ వేస్తాం.’ అని జేసీ  స్పష్టం చేశారు.   కార్యక్రమంలో  ఏడీఎంహెచ్‌వో జగన్నాథరావు, డీఐవో భారతి, ఆర్బీఎస్‌కే వైద్యాధికారి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-01-14T05:39:05+05:30 IST