అరటి గెల మీద పడిందని కోర్టుకు వెళ్లిన కూలీ.. Court తీర్పు విని షాకైన తోట యజమాని.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-10-13T01:44:51+05:30 IST

తోట పని చేస్తున్న కూలీపై ప్రమాదవశాత్తు ఓ అరటి గెల పడింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. నష్టపరిహారం కోసం కోర్టుకు వెళ్లాడు. ఐదేళ్ల తర్వాత చివరకు కోర్టు ఇచ్చిన తీర్పు విని

అరటి గెల మీద పడిందని కోర్టుకు వెళ్లిన కూలీ.. Court తీర్పు విని షాకైన తోట యజమాని.. చివరకు ఏం జరిగిందంటే..

ప్రమాదాలు జరిగే సమయంలో కారకులైన వారి నుంచి నష్టపరిహారం రాబట్టడం సహజమే. కొన్నిసార్లు కోర్టులకు వెళ్లే సందర్భాలు కూడా ఉంటాయి. ఆస్ట్రేలియాలో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. తోట పని చేస్తున్న కూలీపై ప్రమాదవశాత్తు ఓ అరటి గెల పడింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. నష్టపరిహారం కోసం కోర్టుకు వెళ్లాడు. ఐదేళ్ల తర్వాత చివరకు కోర్టు ఇచ్చిన తీర్పు విని.. ఆ తోట యజమాని షాక్ అవ్వాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. 


ఆస్ట్రేలియా క్వీన్స్‌ల్యాండ్‌ సమీపంలో కాలిన్స్‌ అనే వ్యక్తికి అరటి తోట ఉంది. ఓ రోజు జైర్ లాంగ్‌ బాటమ్ అనే కూలీ తోటలో పని చేస్తున్నాడు. అరటి గెలలను తెంపే క్రమంలో ఉన్నట్టుండి ఓ గెల కూలీపై పడింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కారణంగా అతను వికలాంగుడు అవ్వాల్సి వచ్చింది. దీంతో జీవనోపాధి కోల్పోయాడు. తనకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ కోర్టుకు వెళ్లాడు. 2016లో నమోదైన ఈ కేసు.. కోర్టులో నడుస్తూనే ఉంది. అయితే తాజాగా దీనిపై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇది విని ఆ తోట యజమాని షాక్ అవ్వాల్సి వచ్చింది.


ఈ కేసుపై  తాజాగా కోర్టులో మరోసారి వాదనలు జరిగాయి. అరటి గెల పడడంతోనే తాను వికలాంగుడిని అయ్యానని, ఈ కారణంగా ఐదేళ్లుగా ఇంటికే మరిమితం అయ్యానని, దీంతో తాను తీవ్రంగా నష్టపోయానని, నష్టపరిహారం ఇప్పించాలని బాధితుడు విన్నవించుకున్నాడు. ఇరువైపు వాదనలు విన్న క్వీన్స్‌లాండ్ సుప్రీంకోర్టు.. బాధితుడికి రూ.4కోట్లు(మన కరెన్సీలో) చెల్లించాలని తీర్పు ఇచ్చింది. దీంతో షాక్ అయిన తోట యజమాని.. చేసేదేమీలేక బాధితుడికి ఆ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది.

Updated Date - 2021-10-13T01:44:51+05:30 IST