ఎన్నికల బరిలో మహిళలు!

ABN , First Publish Date - 2020-11-09T05:42:18+05:30 IST

కమలా హ్యారిస్‌.... అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. అంతేకాదు తొలి భారతీయ అమెరికన్‌ మహిళ కూడా కావడం విశేషం...

ఎన్నికల బరిలో మహిళలు!

కమలా హ్యారిస్‌.... అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. అంతేకాదు తొలి భారతీయ అమెరికన్‌ మహిళ కూడా కావడం విశేషం. అమెరికా చరిత్రలో రాజకీయ పదవుల్లో ఉన్నత స్థానాల్లో మహిళలు లేరు. ఇప్పుడు ఆ స్థానాన్ని కమలా హ్యారిస్‌ పూరించారు. అయితే మహిళలు ఎన్నికల్లో పోటీపడటం ఇదే మొదటిసారి కాదు. చాలా మంది మహిళలు అమెరికా ఎన్నికల బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.


  1. 1940 సర్‌ప్రైజ్‌ పార్టీ అభ్యర్థిగా గ్రేసీ అల్లెన్‌ బరిలో దిగారు. ఫ్రాంక్టిన్‌ డి.రూజ్‌వెల్ట్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.
  2. 1972లో లిండా జెన్నెస్‌ సోషలిస్ట్‌ వర్కర్స్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. రిచర్డ్‌ నిక్సన్‌ గెలుపొందారు.
  3. 1976లో మార్గరేట్‌ రైట్‌ పీపుల్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి జిమ్మీ కార్టర్‌ చేతిలో ఓడిపోయారు.
  4. 1984లో సోనియా జాన్సన్‌ సిటిజన్స్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రోనాల్డ్‌ రీగన్‌ గెలుపొందారు.
  5. 1988లో లెనోరా ఫ్యులాని న్యూ అలయెన్స్‌ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. జార్జ్‌ హెచ్‌.డబ్యు బుష్‌ని విజయం వరించింది. 1992లో ఆమె తిరిగి బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో బిల్‌ క్లింటన్‌కు విజయం దక్కింది.
  6. 2008లో గ్రీన్‌ పార్టీ అభ్యర్థిగా సింథియా మెకెన్నె పోటీ చేసి బరాక్‌ ఒబామా చేతిలో ఓటమిచెందారు.
  7. 2012లో జిల్‌ స్టెయిన్‌ గ్రీన్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినా ఫలితం మారలేదు. బరాక్‌ ఒబామానే విజయం వరించింది. 2016లో తిరిగి ఆమె బరిలో దిగితే ఈ సారి డొనాల్డ్‌ ట్రంప్‌కు విజయం దక్కింది. అదే ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్‌ పోటీ చేశారు.
  8. 2020 ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి డెమెక్రాట్‌ అభ్యర్థిగా బరిలో దిగిన కమలా హ్యారిస్‌ విజయం సాధించి తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు.
  9. నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మొదటిసారి మహిళా అభ్యర్థిగా బరిలోకి దిగింది విక్టోరియా వుడ్‌హుల్‌. అయితే ఆమెకు 35 ఏళ్లు నిండకపోవడంతో తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత 2016లో హిల్లరీ క్లింటన్‌ అమెరికా ప్రెసిడెంట్‌ బరిలో నిలిచిన తొలి మహిళగా గుర్తింపు పొందారు.

Updated Date - 2020-11-09T05:42:18+05:30 IST