చివరి దశకు..ధాన్యం కొనుగోళ్లు

ABN , First Publish Date - 2020-05-31T11:00:41+05:30 IST

యాసంగి ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో

చివరి దశకు..ధాన్యం కొనుగోళ్లు

జూన్‌ 8 వరకు కేంద్రాల నిర్వహణ 

2.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

2,06,533 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు

రైతులకు రూ.214,80 కోట్లు చెల్లింపు 

బకాయిలు రూ.72.96 కోట్లు 

జిల్లాలో 215 కొనుగోలు కేంద్రాలు

89 కేంద్రాల మూసివేత


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల): యాసంగి ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు అధికా ర యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎన్నడూ లేని విధంగా గ్రా మాల్లోనే అధికారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మాస్క్‌ లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, సానిటేషన్‌ చేయడం వం టి చర్యలు చేపట్టారు. జిల్లాలో 215 గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను నిర్వహించారు. ఐకేపీ నుంచి 77, సింగిల్‌ విండోల ద్వారా 133, డీసీ ఎంస్‌ 3, మెప్మా ద్వారా 2 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో కొనుగోళ్లను వేగవంతంగా పూర్తి చేశారు. రైతులు ధర్నాలు, రాస్తారోకో లు, ధాన్యం తగులబెట్టడం వంటి ఆందోళనలు చేపట్టినా చివరకు కొ నుగోళ్లు సవ్యంగా కొనసాగుతున్నాయి.


2,06,533 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 215 కొనుగోలు కేంద్రాల ద్వారా 2.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 36,975 మంది రైతుల నుంచి 2,06,533 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొ నుగోలు చేశారు. జూన్‌ 8వరకు అ నుకున్న లక్ష్యం పూర్తి చేయనున్నా రు. ఐకేపీ ద్వారా 13,544 మంది రై తుల నుంచి 72,415 మెట్రిక్‌ ట న్నులు, సింగిల్‌ విండోల ద్వారా 22,398 మంది రైతుల నుంచి 1,28, 763 మెట్రిక్‌ టన్నులు, డీసీఎంస్‌ ద్వారా 660 మంది రైతుల నుంచి 3,284 మెట్రిక్‌ టన్నులు, మెప్మా ద్వారా 373 మంది రైతుల నుంచి 2,069 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటి కే 89 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి కావడంతో వాటిని మూసి వేశారు. మిగతా చోట్ల కొనుగోళ్లను వేగవంతం చేస్తు న్నారు. వర్షాలు ప్రారంభంకాక ముందే జూన్‌ 8 వరకు పూర్తి చేయా లని ప్రభుత్వం సూచిస్తుండడంతో కొనుగోళ్లు వేగవంతం చేశారు. 


రైతులకు రూ.214.80 కోట్ల చెల్లింపు 

ధాన్యం కొనుగోళ్ల డబ్బులు అలస్యంగా వస్తాయని రైతులు మొదట ఆందోళన చెందినా కొనుగోలు డబ్బులు ఖాతాల్లో జమ చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 36,975 మంది రైతుల నుంచి రూ.385.94 కోట్ల విలువైన ధాన్యా న్ని కొనుగోలు చేశారు. 25,755 మంది రైతులకు సం బంధించిన రూ.276.20 కోట్లు ఆన్‌లైన్‌ చేశారు. ఇందులో 24,154 మంది రైతుల ఖాతాల్లో రూ.214.80 కోట్లు జమ చేశారు. 2,614 మంది రైతులకు రూ.72.96 కోట్లు చెల్లించాల్సి ఉంది. సకాలం లోనే కొనుగోళ్లు పూర్తవుతాయని భావిస్తున్నారు. 

Updated Date - 2020-05-31T11:00:41+05:30 IST