చివరి దశలో ధాన్యం కొనుగోళ్లు

ABN , First Publish Date - 2020-06-01T09:48:33+05:30 IST

ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. జిల్లాలో రబీకి సంబంధించి 12.28 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు

చివరి దశలో ధాన్యం కొనుగోళ్లు

జిల్లాలో 11.42 లక్షల టన్నుల సేకరణ

రైతులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.382 కోట్లు 


ఏలూరుసిటీ, మే 31: ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. జిల్లాలో రబీకి సంబంధించి 12.28 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు చేయా లని లక్ష్యంగా నిర్ణయించుకోగా ఇప్పటివరకు 11.42 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సంబంఽ దించి 343 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులకు ఽధాన్యం సొమ్ములు చెల్లించడంలో జాప్యం జరుగుతోందనే విమర్శలు విన్పిస్తున్నాయి.


రోజుకు ఒక్కొక్క కేంద్రానికి వారు కొనుగోలు చేసిన ధాన్యాన్ని బట్టి 300 టన్నుల కొనుగోళ్లకు సంబంధించి సొమ్ములు బ్యాంకుల్లో జమ చేస్తున్నారు.  జిల్లాలో 93వేల మంది  రైతుల నుంచి రూ.2072 కోట్లు విలువైన 11.42 లక్షల మెట్రి క్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటివరకు రైతుల బ్యాంకు ఖాతా లకు రూ.1690.83 కోట్లు జమ చేశారు.  రైతులకు రూ.382 కోట్లు చెల్లించాల్సి ఉంది. ధాన్యం కొనుగోళ్లలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలోనే ఉంది.

Updated Date - 2020-06-01T09:48:33+05:30 IST