గొర్రెల పంపిణీకి తాజా మార్గదర్శకాలు

ABN , First Publish Date - 2021-03-05T05:49:52+05:30 IST

ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పం పిణీలో ఎటువంటి గోల్‌మాల్‌ చోటుచేసుకోకుండా ఉండడానికి తాజా గా మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

గొర్రెల పంపిణీకి తాజా మార్గదర్శకాలు
జిల్లాలో జరుగుతున్న సబ్సీడీ గొర్రెల పెంపకం

 రాష్ట్ర స్థాయిలో సెంట్రల్‌ మానిటరింగ్‌ యూనిట్‌

 సమస్యలు తలెత్తకుండా కొనుగోళ్లకు ప్రణాళిక

జగిత్యాల, మార్చి 2 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పం పిణీలో ఎటువంటి గోల్‌మాల్‌ చోటుచేసుకోకుండా ఉండడానికి తాజా గా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఇందుకు సంబంధించి జిల్లా ప శుసంవర్థక శాఖాధికారులకు నూతన మార్గదర్శకాలు అందాయి. గొర్రెల పెంపకం దారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం సబ్సి డీ గొర్రెల పంపిణీ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద జీవాలను పంపిణీ చేస్తున్నప్పటికీ పలు అవకతవకలు, ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. మొదటి విడత కింద జిల్లాలో విజయవంతంగా గొర్రెల పం పిణీ కార్యక్రమాన్ని దాదాపుగా పూర్తి చేశారు. రెండో విడత కార్యక్ర మా న్ని ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జగిత్యాలలో ప్రారం భించారు. కాగా గొర్రెల పంపిణీలో గోల్‌మాల్‌ చోటుచేసుకొని లబ్ధిదా రులకు తక్కవ సంఖ్యలో జీవాలను పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నుం చి జిల్లాకు దిగుమతి చేసుకునే గొర్రెల ధరలు అక్కడి మార్కెట్‌లో అధి కంగా ఉండడమే జీవాలను తక్కవగా పంపిణీ చేయడానికి ప్రధాన కా రణంగా అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో సంబంధిత విషయా న్ని సర్కారు పెద్దల దృష్టికి అధికారులు తీసుకవెళ్లారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం సబ్సీడీ గొర్రెల పంపిణీ పథకంలో చేర్పులు, మార్పులు చే స్తూ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకా రం సబ్సీడీ గొర్రెల పంపిణీ చేయడానికి పశుసంవర్థక శాఖ అధికారు లు సమాయత్తం అవుతున్నారు.

మానిటరింగ్‌ యూనిట్‌ పర్యవేక్షణలో...

సబ్సీడీ గొర్రెల పంపిణీ పథకంలో చేర్పులు, మార్పులు చేస్తూ ప్ర భుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్తగా రాష్ట్ర స్థాయిలో సెంట్రల్‌ మానిటరింగ్‌ యూనిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ యూనిట్‌ పర్యవేక్షణలోనే రెండో విడత గొర్రెల పంపిణీ వ్యవహారాలు జరపనున్నారు. గొర్రెలను కొనుగోలు చేయాల్సిన ప్రదేశాలను యూనిట్‌ సభ్యులే నిర్ణయిస్తారు. అక్కడి మార్కెట్‌లో పెరిగిన ధరలకు అనుగు ణంగా, లబ్ధిదారులకు ఎలాంటి నష్టం ఎదురుకాకుండా గొర్రెలు లభిం చేలా యూనిట్‌ సభ్యులు సమన్వయం చేస్తారు. తాజా మార్గదర్శకాల ప్రకారం జీవాలను కొనుగోలు చేసిన చోటనే ఇన్సూరెన్స్‌ ప్రక్రియను పూ ర్తి చేయనున్నారు. యూనిట్‌ ధరలోనే ఇన్సూరెన్స్‌, రవాణా చార్జీలు వ ర్తించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గొర్రెల పంపిణీ పథకంలో తీ సుకోవాల్సిన జాగ్రత్తలు, నూతన మార్గదర్శకాలను అమలు చేయడాని కి జిల్లాకో అధికారి చొప్పున హైద్రాబాద్‌లో అవగాహణ కల్పించడానికి ప్రభుత్వ సమాయత్తం అవుతోంది. 

జిల్లాలో పంపిణీ ఇలా...

జిల్లాలో రెండు విడతల్లో పంపిణీ చేయాలని నిర్ణయించిన అధికా రులు ఒకటవ విడతను 2017-18లోనే దాదాపు లక్ష్యం మేరకు యూ ని ట్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేశారు. మొదటి విడతలో 10,510 యూ నిట్లు మంజూరు కాగా 9,738 యూనిట్ల పంపిణీ జరిపారు. మరో 772 యూనిట్ల పంపిణీ వివిధ కారణాల వల్ల చేయలేదు. రెండో విడతలో 10,555 యూనిట్లు మంజూరు అయ్యాయి. ఇందులో కార్యక్రమాన్ని 2018-19 ఆర్థిక సంవత్సరంలో 5,198 యూనిట్ల పంపిణీ చేశారు. మిగి లిన 5,357 యూనిట్ల పంపిణీ చేయాల్సి ఉండగా వివిధ కారణాలతో నిలిచిపోయింది. సీఎం కేసీఆర్‌ జనవరి మాసం మొదటి వారంలో తీసు కున్న నిర్ణయంతో రెండో విడత లిస్టు-2 కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా లో 2021 జనవరి 21వ తేదిన మంత్రి తలసాని యాదవ్‌ చేతుల మీ దుగా ప్రారంభించారు. జిల్లాలోని 18 మండలాల్లో 88 యూనిట్లు లబ్ధి దారులకు పంపిణీ జరిపారు. మిగిలిన యూనిట్లను తాజా మార్గదర్శ కాల ప్రకారం పంపిణీ చేయడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.

Updated Date - 2021-03-05T05:49:52+05:30 IST