Advertisement
Advertisement
Abn logo
Advertisement

కూతురి గురించి రెండు విషయాలు దాచి.. 26 ఏళ్ల ఈ యువకుడితో పెళ్లి చేశారా తల్లిదండ్రులు.. 15వ రోజే అసలు నిజం తెలిసి..

నూరు అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయమన్నారు పెద్దలు. అయితే అబద్ధాలకు ఓ పరిమితి అంటూ ఉంటుంది. ఒక్కోసారి చిన్న అబద్ధమే పెద్ద సమస్యను తెచ్చిపెడుతుంది. ఉత్తరప్రదేశ్‌లో ఇలాగే ఓ ఘటన జరిగింది. కుమార్తెకు సంబంధించిన రెండు విషయాలను దాచి, 26 ఏళ్ల యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. మొత్తానికి పెళ్లి చేశాం.. అంతా బాగుంటుందని అనుకున్నారు. కానీ పెళ్లయిన 15రోజులకే అసలు నిజం తెలిసింది. యువతి తల్లిదండ్రులు అడిన అబద్ధాల వల్ల చివరకు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌ చందౌలీ హరిశంకర్‌పూర్‌లో నివాసముంటున్న ఇంద్రజిత్ సింగ్ బాఘా కుమారుడు.. హర్దయాల్ సింగ్ బాఘా(26)కు నెల రోజుల క్రితం వివాహం జరిగింది. అనంతరం భార్యను ఇంటికి తీసుకెళ్లాడు. సవ్యంగా సాగిపోతున్న వారి సంసారంలో కేవలం 15 రోజులకే సమస్యలు మొదలయ్యాయి. ఒక్క సారిగా వారికి రెండు విషయాలు తెలిసి షాక్ అయ్యారు. తన భార్యకు మానసిక స్థితి సరిగా ఉండదని తెలుసుకున్నాడు. అలాగే వయసులో కూడా తనకంటే పదేళ్లు పెద్దదని తెలుసుకుని అవాక్కయ్యాడు. అబద్ధాలు చెప్పి పెళ్లి చేశారని రోజూ ఆలోచించేవాడు. ఈ విషయంలో భార్యకు, భర్త కుటుంబ సభ్యులకు మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో 15 రోజుల అనంతరం ఆమె పుట్టింటికి వచ్చేసింది.

అప్పటి నుంచి ఆమె, తల్లిదండ్రులతోనే ఉంటోంది. అయితే ఈ క్రమంలో ఓ రోజు భార్య కుటుంబ సభ్యల నుంచి భర్తకు నోటీసులు వెళ్లాయి. వరకట్నం పేరుతో తమ కూతురుని వేధిస్తున్నాడని.. అతడి అత్తమామలు నోటీసులు పంపడం ప్రారంభించారు. దీంతో రోజూ మానసికంగా తీవ్ర ఆందోళనకు గురయ్యేవాడు. రోజు రోజుకూ అత్తమామల నుంచి సమస్యలు పెరుగుతుండడంతో గత శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement