ముస్లిం కుటుంబాల్లో వెలుగులు నిండాలి

ABN , First Publish Date - 2020-05-26T10:15:53+05:30 IST

రంజాన్‌ పండుగతో ప్రతి ముస్లిం కుటుంబంలో వెలుగులు నిండాలని మంత్రి శంకరనారాయణ, జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ..

ముస్లిం కుటుంబాల్లో వెలుగులు నిండాలి

మంత్రి శంకరనారాయణ, కలెక్టర్‌ గంధం చంద్రుడు


 అనంతపురం అర్బన్‌, మే25: రంజాన్‌ పండుగతో ప్రతి ముస్లిం కుటుంబంలో వెలుగులు నిండాలని మంత్రి శంకరనారాయణ, జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆకాం క్షించారు. సోమవారం రంజాన్‌ పండుగను పురస్కరిం చుకుని మంత్రి, కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డిని ఆల్‌ మైనార్టీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అసోసియేషన్‌ (ఆల్‌ మెవా) ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి, పుస్తకాన్ని బహూకరించారు. కార్యక్రమంలో ఆల్‌మెవా ప్రతినిధులు షారుక్‌ అహ్మద్‌, షేక్షావలి, ఫకృద్దీన్‌ దౌలా పాల్గొన్నారు.

Updated Date - 2020-05-26T10:15:53+05:30 IST