కంటైన్మెంట్‌కే లాక్‌

ABN , First Publish Date - 2020-05-31T10:02:35+05:30 IST

లాక్‌డౌన్‌ నాలుగో విడత ఆదివారంతో ముగియనుంది. అయితే కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నందున మళ్లీ పొడిగిస్తారనే ఊహాగానాల

కంటైన్మెంట్‌కే లాక్‌

  • లాక్‌డౌన్‌ మళ్లీ జూన్‌ 30 వరకు పొడిగింపు
  • అయితే కంటైన్మెంట్‌ ప్రాంతాలకే పరిమితం
  • జిల్లాలో మొత్తం 21 కంటైన్మెంట్‌ జోన్లు
  • వీటిలో కఠిన ఆంక్షలు కొనసాగింపు
  • ఇవి మినహా జిల్లా అంతటా జూన్‌ 8 నుంచి దేవాలయాలన్నీ తెరవడానికి అనుమతి 
  • అటు హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌మాల్స్‌ యథావిథిగా పనిచేయడానికి ఓకే
  • జిల్లాలో శనివారం జీ మామిడాడలో మరో 16 పాజిటివ్‌ కేసుల నిర్ధారణ
  • జిల్లాలో 219 కి చేరిన కొవిడ్‌ కేసులు
  • మృతి చెందిన వ్యక్తి ద్వారా 128 మందికి వైరస్‌

(కాకినాడ-ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

లాక్‌డౌన్‌ నాలుగో విడత ఆదివారంతో ముగియనుంది. అయితే కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నందున మళ్లీ పొడిగిస్తారనే ఊహాగానాల మధ్య అనుకున్నట్టు గానే కేంద్రం అయిదోవిడత లాక్‌డౌన్‌ను జూన్‌ 30 వరకు పొడిగిస్తున్నట్టు ప్రక టించింది. ఇప్పటికే ప్రజలు రెండు నెలలకుపైనే లాక్‌డౌన్‌తో ఇళ్లకు పరిమితమ య్యారు. మొదటి విడత లాక్‌డౌన్‌ మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 14, రెండో విడత ఏప్రిల్‌ 15 నుంచి మే 3 వరకు, మూడో విడత మే 4 నుంచి మే 17 వరకు, నాలుగో విడత మే 18 నుంచి మే 31వరకు అమలుచేశారు. దీంతో ఇన్ని రోజులు ప్రజలు ఎక్కడికక్కడ లాక్‌అయ్యారు. అయితే అయిదో విడత లాక్‌డౌన్‌ను 30 రోజులు పొడిగిస్తున్నట్టు శనివారం ప్రకటించిన కేంద్రం ఈసారి ప్రజలకు భారీ ఊరట కలిగించింది. పాజిటివ్‌ కేసులు నమోదై, చుట్టుపక్కల ప్రాంతాలకు ఇవి విస్తరించే ప్రమాదం ఉండడంతో అధికారులు గుర్తించిన కంటైన్మెంట్‌ జోన్లకు మాత్రమే అయిదో విడత లాక్‌డౌన్‌ వర్తిస్తుందని, మిగిలిన ప్రాంతాలకు లాక్‌డౌన్‌ వర్తించదని స్పష్టతనిచ్చింది. దీంతో జిల్లాలో 21 కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో (12 యాక్టివ్‌, 11 ఇన్‌యాక్టివ్‌ జోన్లు) మినహా మిగిలిన జిల్లా మొత్తం సోమవారం నుంచి లాక్‌డౌన్‌ లేనట్టే.


అయితే కర్ఫ్యూ సమయం మాత్రం రాత్రి తొమ్మిది నుంచి ఉదయం అయిదు వరకు మాత్రం అమలుకానుంది. కాగా జిల్లాలో పాజిటివ్‌ కేసులు నమోదై కంటైన్మెంట్‌  జోన్లుగా గుర్తించిన వాటిలో మామిడాడ, రామచం ద్రపురం (3వార్డులు), బిక్కవోలు (3వార్డులు), ఏలేశ్వరం మండలం యర్రవరం, అమలాపురంలో బండారులంక, రంపచోడవరంలో రెండు గ్రామాలు ఉన్నాయి. ఇవికాకుండా తుని, రాజమహేంద్రవరంలో కొన్ని వార్డులు, సామర్లకోట, పెద్దా పురంలో కొన్ని వార్డులు కూడా కంటైన్మెంట్‌ జోన్ల జాబితాలో ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు కొత్తగా నమోదుకాకపోవడంతో వీటిని అన్‌యాక్టివ్‌ కంటైన్మెంట్‌ జోన్లుగా వర్గీకరించారు. ఇందులో వేటిని మినహాయిస్తారు, మిగిలిన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలుచేస్తారా అనేదానిపై కలెక్టర్‌ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.


కొన్ని తప్పించి అన్నీ తెరవొచ్చు...

దేవాలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలు జూన్‌ 8 నుంచి తెరవడానికి కేంద్రం అనుమతి ఇవ్వడంతో జిల్లాలో అన్నవరం, ఇతర ప్రముఖ ఆలయాలన్నీ తెరుచుకోనున్నాయి. అలాగే అరవై రోజులకుపైగా మూతపడి ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్‌ కూడా తెరుచుకోనున్నాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌పూల్స్‌ వంటివి వాటికి ప్రస్తుతం మినహాయింపు లేదు.  అలాగే స్కూళ్లు, కాలేజీల పునఃప్రారంభం ఎప్పుడనేది రాష్ట్రాలతో చర్చించి జూలైలో తేదీ వెల్లడించనున్నట్టు వివరించింది. అలాగే కొత్త లాక్‌డౌన్‌ ప్రకారం రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపిన కేంద్రం కర్ఫ్యూ అమలును రెండు గంటల సమయం కుదించింది. అంటే ఇకపై వాణిజ్య దుకాణాలు రాత్రి ఏడుకు బదులు తొమ్మిది వరకు నిర్వహించే అవకాశం ఏర్ప డింది. కేంద్రం తాజా ప్రకటనతో ప్రజలకు చాలావరకు వెసులుబాటు లభించింది.

Updated Date - 2020-05-31T10:02:35+05:30 IST