పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేయాలి

ABN , First Publish Date - 2021-05-14T06:28:14+05:30 IST

కరోనా వైరస్‌ కట్టడి కోసం పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ పోలీస్‌ అధికారులను ఆదేశించారు.

పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేయాలి
ఇన్‌చార్జి ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌తో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

నిర్మల్‌ టౌన్‌, మే 13 : కరోనా వైరస్‌ కట్టడి కోసం పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని శివాజీచౌక్‌, అంబేద్కర్‌ చౌక్‌లో ఇన్‌చార్జి ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ఆయన వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పది రోజుల పాటు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ ఉంటున్నందున ప్రజలెవరూ బయట కు రావద్దని అన్నారు. వాహనాలపై వెళ్తున్న వారిని నిలిపి లాక్‌ డౌన్‌ నిబంధ నలు పాటించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ప్రతి వాహనాన్ని తనిఖీలు నిర్వహించాలని, అత్యవసర పనులపై బయటకు వచ్చిన వారిని తగిన ఆధారాలు చూసి వదిలి పెట్టాలని పోలీస్‌ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, సీఐ జీవన్‌రెడ్డి, అధి కారులు, పోలీస్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-14T06:28:14+05:30 IST