పొడవద తొలి పొద్దట

ABN , First Publish Date - 2021-01-01T06:04:36+05:30 IST

పొడవద తొలిపొద్దట రైతుగుండె వాకిట కడివెడు కన్నీళ్ళట...

పొడవద తొలి పొద్దట

పొడవద తొలిపొద్దట

రైతుగుండె వాకిట

కడివెడు కన్నీళ్ళట

సానిపి జల్లేనట

అడగర జెర అడగరా

సూర్యుడొచ్చె వేళరా II అడగర II


లోకమంత వేడుకలో

ఆడిపాడుతుంటెరా

ఎవరికెవరు పట్టకుండ

తాగితూలుతుంటెరా

ఎందుకు మన రైతు ఢిల్లి రోడ్లపైకి జేరెనో

ఎందుకు ఆ చలిలోగూడ 

పోరు జేస్తుండెనో

II అడగర II 


రైతుకెంత చింత ఉన్న

మనసు వెన్నపూసరా

మెడలో ఉరులు బిగుస్తున్న

పరుల మేలె కోరెరా

కరోనొస్తె దేశానికి పంటనూర్సి పెట్టెనో

వలస జీవి పల్లె కొస్తె వరుస గల్పి పిల్సెనో

ఆగిపోని కాలమొకటి

వేగిర పెడుతుందిరా

ఆధునికత పేర బతుకు

చిదిమి వేస్తుందిరా

దున్నె ప్రతి రైతు ‍‍

చెమట ఫలితమడ్గుతుండురా

కార్పొరేట్‌ దోపిడిని తరిమి కొడతనండురా


ఎవరి ఊరు ఎవరిది

విశ్వమంత మనదిరా

ఆకలికి శోకానికి

ఎల్లలేమి లేవురా

తొలి ఉత్పత్తికి రైతుకదా 

నాంది పలికినాడురా

నవభారత్‌లో జై కిసానంటు 

పేరుపొంది నాడురా


ఆడగర జెర అడగరా

కదనమందు రైతురా

కరిగె మనసు ఢిల్లికుంటె

దేశానికి గెలుపురా

సూర్యు‍నల్లె మండుతేనె

గుండె నిండ వెలుగురా

పొడవద తొలి పొద్దట

పొడవద తొలిపొద్దట

రైతుగుండె వాకిట

కడివెడు కన్నీళ్ళట

సానిపి జల్లేనట

అడగర జెర అడగరా

సూర్యుడొచ్చె వేళరా II అడగర II

లోకమంత వేడుకలో

ఆడిపాడుతుంటెరా

ఎవరికెవరు పట్టకుండ

తాగితూలుతుంటెరా

ఎందుకు మన రైతు ఢిల్లి రోడ్లపైకి జేరెనో

ఎందుకు ఆ చలిలోగూడ 

పోరు జేస్తుండెనో

II అడగర II 

రైతుకెంత చింత ఉన్న

మనసు వెన్నపూసరా

మెడలో ఉరులు బిగుస్తున్న

పరుల మేలె కోరెరా

కరోనొస్తె దేశానికి పంటనూర్సి పెట్టెనో

వలస జీవి పల్లె కొస్తె వరుస గల్పి పిల్సెనో

ఆగిపోని కాలమొకటి

వేగిర పెడుతుందిరా

ఆధునికత పేర బతుకు

చిదిమి వేస్తుందిరా

దున్నె ప్రతి రైతు ‍‍

చెమట ఫలితమడ్గుతుండురా

కార్పొరేట్‌ దోపిడిని తరిమి కొడతనండురా

ఎవరి ఊరు ఎవరిది

విశ్వమంత మనదిరా

ఆకలికి శోకానికి

ఎల్లలేమి లేవురా

తొలి ఉత్పత్తికి రైతుకదా 

నాంది పలికినాడురా

నవభారత్‌లో జై కిసానంటు 

పేరుపొంది నాడురా


ఆడగర జెర అడగరా

కదనమందు రైతురా

కరిగె మనసు ఢిల్లికుంటె

దేశానికి గెలుపురా

సూర్యు‍నల్లె మండుతేనె

గుండె నిండ వెలుగురా

మిత్ర

Updated Date - 2021-01-01T06:04:36+05:30 IST