Abn logo
Aug 14 2020 @ 13:44PM

తూ.గో.జిల్లాలో నలుగురు మత్స్యకారుల గల్లంతు

తూ.గో.జిల్లా: సముద్రతీర ప్రాంతం అల్లకల్లోలంగా మారుతోంది. ఉప్పాడ నుంచి సముద్రంలో చేపలవేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈనెల 11న మత్స్యకారులు వేటకు వెళ్లారు. బైరవపాలెం తీరంవైపు వెళ్లిన మూడు బోట్లలో రెండు సురక్షితంగా ఒడ్డుకు చేరాయి. అయితే ఒక బోటులో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ బోటు ఆచూకి తెలియడంలేదు. అదే బోటులో ప్రయాణిస్తున్న వంకా వీరన్న, ప్రసాద్, సంజీవ్‌తో పాటు కాశయ్య గల్లంతయ్యారు. దీంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 


బుధవారం మధ్యాహ్నం చివరిసారిగా బోటు యజమాని తోటి జాలర్లకు మత్స్యకారులు సమాచారం ఇచ్చారు. బోటు ఇంజన్ పాడైందని మెసేజ్ పెట్టారు. దీంతో మరో రెండు బోట్లలో జాలర్లు.. గల్లంతైన బోటు కోసం వెతుక్కుంటూ వెళ్లారు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో వారంతా ఉప్పాడ తీరం చేరుకున్నారు.

Advertisement
Advertisement
Advertisement