Abn logo
Nov 23 2020 @ 02:39AM

ప్రేమజంట ఆత్మహత్య

మిడ్జిల్‌, నవంబరు 22: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మిడ్జిల్‌ మండలంలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకొంది. బాలిక(15).. యువకుడు(20) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. శనివారం రాత్రి 9గంటల సమయంలో పెదనాన్న ఇంటికని వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో.. పోలీసులకు బాలిక తండ్రి ఆదివారం ఫిర్యాదు చేశాడు.

గ్రామానికి చెందిన ఒక యువకుడిపై అనుమానం ఉందని పేర్కొన్నాడు. అయితే.. గ్రామశివారులోని తోటలో ఒకే చెట్టుకు వారిద్దరూ ఉరేసుకున్నారు.


Advertisement

తెలంగాణ మరిన్ని...

Advertisement