ముక్కులో అయస్కాంతం ముక్కలు

ABN , First Publish Date - 2020-04-01T05:58:35+05:30 IST

ప్రయోగాలు అప్పుడప్పుడు వికటించడం మామూలే. సరిగ్గా అలాంటిదే ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. అయస్కాంతాలతో చేయబోయిన ప్రయోగం బెడిసికొట్టింది. అవి కాస్తా ముక్కులో ఇరుక్కుని...

ముక్కులో అయస్కాంతం ముక్కలు

ప్రయోగాలు అప్పుడప్పుడు వికటించడం మామూలే. సరిగ్గా అలాంటిదే ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. అయస్కాంతాలతో చేయబోయిన ప్రయోగం బెడిసికొట్టింది. అవి కాస్తా ముక్కులో ఇరుక్కుని ఆసుపత్రికి వెళ్ళాల్సిన పరిస్థితి ఎదురైంది. మరికాస్త విషమిస్తే ప్రాణాలకే ముప్పు కలిగేదే. వివరాల్లోకి వెళితే... 


డాక్టర్‌ డేనియల్‌ రేర్డన్‌ ఆస్ట్రేలియన్‌ ఆస్ట్రోఫిజిస్ట్‌. మెల్‌బోర్న్‌ యూనివర్సిటీలో రీసెర్చ్‌ ఫెలో. పల్సర్లు, గురుత్వాకర్షణ తరంగాలపై అధ్యయనం చేస్తుంటారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ముఖాలను తాకకుండా ఉండేందుకు పరికరాన్ని కనుగొనే దిశగా ఆయన చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ముఖాన్ని తాకగానే అలారమ్‌ మోగేలా ఒక గొలుసును రూపొందించారు. అది ఫలించింది. ముక్కు వద్ద అయస్కాంతం ఉంటే ఆకర్షించడం సులువు అన్న దిశగా యోచించడమే కాదు, సరిగ్గా ఆ పనే చేశాడు. ముక్కుకు ఇరువైపులా లోపలా, బైటా నాలుగు అయస్కాంతం ముక్కలు ఉంచుకుని ప్రయోగం చేశాడు. గాలిని గట్టిగా పీల్చినప్పుడు రెండు అయస్కాంతాలు లోపలికి వెళ్ళాయి. బైట ఉన్న అయస్కాంతాలతో వాటిని తీద్దామనుకుంటే అవీ లోపలికి వెళ్ళి ప్రాణాంతకంగా మారాయి. గూగుల్‌ సాయంతో వాటిని తీసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దాంతో ఒక స్నేహితురాలి సాయంతో ఆసుపత్రికి వెళ్ళి వాటిని తీయించుకున్నాడు.

Updated Date - 2020-04-01T05:58:35+05:30 IST