Abn logo
Sep 21 2021 @ 01:12AM

మహాధర్నాను విజయవంతం చేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షులు రామారావుపటేల్‌

భైంసా, సెప్టెంబరు 20 : పోడుభూముల విషయంలో గిరిజనులకు న్యాయం చేయాలనే లక్ష్యంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గన్‌ పార్క్‌ వద్ద బుధవారం నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షులు రామారావుపటేల్‌ పిలుపునిచ్చారు. సోమవారం భైంసాలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గిరిజనులకు లక్ష ఎకరాల పోడు భూములను ఇచ్చినట్టే ఇచ్చి ప్రాజె క్టులు, అభివృద్ధి పేరిట కేసీఆర్‌ ప్రభుత్వం వారి వద్ద నుంచి తిరిగి తీసుకుం టుందని ఆరోపించారు. కేసీఆర్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలకు నిరసనగా, గిరిజనులకు అండగా ఉండి న్యాయం చేయాలనే లక్ష్యంతో అఖిల పక్షం ఆధ్వర్యంలో దశల వారి ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం పకడ్భంది విధానాలతో ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతుందన్నారు. బుధవారం గన్‌పార్క్‌ వద్ద అఖిల పక్షం ఆధ్వర్యంలో గిరిజనుల కోసం చేపట్టే మహాధర్నాకు, జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఙప్తి చేశారు. ఇందులో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బాజనొల్ల గంగాధర్‌తో పాటు పలువురు ఉన్నారు.