Advertisement
Advertisement
Abn logo
Advertisement

బావిలోకి దిగి వ్యక్తి మృతి

బావిలోకి దిగి వ్యక్తి మృతి

పాలకవీడు, డిసెంబరు 3: వ్యవసాయ బావిలోకి దిగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్ర కారం.. పాలకవీడు గ్రామానికి చెందిన మేకల కృష్ణయ్య తన వ్యవసాయ పొలంలో ఉన్న బావి మోటారు చెడిపోవడంతో దానిని బయటకు తీసేందుకు కొమ బావిలోకి దిగిన కోటయ్య ఎంతసేపటికీ రాక పోవడంతో ఆందోళన చెందిన రైతు కృష్ణయ్య గ్రామస్థులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గజ ఈతగాడిని రప్పించి కోటయ్య మృతదేహాన్ని బయటకు తీశారు. కోటయ్య ఊపిరాడక మృ తిచెందాడా, విద్యుదాఘాతంతో మృతి చెందాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా వివరాలు తెలుస్తాయన్నారు. మృతుడి సోదరుడి కుమార్తె విజయ ఫిర్యాదు మేరకు కే సు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సైదులు తెలిపారు. 


Advertisement
Advertisement