Advertisement
Advertisement
Abn logo
Advertisement

మద్యం మత్తులో కారులోనే వ్యక్తి మృతి

చీరాలటౌన్‌, డిసెంబరు 7 : మద్యం మత్తులో కారులోనే వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మునిసిపల్‌ పరిధిలోని అవ్వారువారి వీధికి చెందిన నాదెండ్ల లీలాచందర్‌(30) కొంత కాలంగా భార్యతో కలహాల నేపథ్యంలో వి డిపోయి దూరంగా ఉంటున్నాడు. ఇదిలా ఉంటే అమ్మ, అక్కతో కూడా ఆస్తి వివాదాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. అతను మద్యానికి బానిసగా మారాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు చీరాల ము ంతావారి సెంటర్‌లో మద్యం సేవించాడు. అనంతరం కూరగాయల మార్కెట్‌ వెనుక బాబారైస్‌ మిల్‌ సమీపంలో కారులోనే మృతి చెంది ఉన్నాడు. అర్ధరాత్రి గమనించిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వై ద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు.


Advertisement
Advertisement