Advertisement
Advertisement
Abn logo
Advertisement

కోతుల భయంతో బిల్డింగ్ పై నుంచి పడి వ్యక్తి మృతి

ప్రకాశం: జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మార్కాపురంలో భవన నిర్మాణ పనులు చేస్తున్న మేస్త్రి ఖాసింపై కోతుల దాడి చేశాయి. ఆ భయంతో ఆయన నాలుగంతస్తుల భవనం నుంచి కిందపడి మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ స్థానికుల ద్వారా వివరాలు అడిగితెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతుడి కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. కేసు నమోదు  చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కోతుల భయంతోనే కిందపడ్డాడా? లేక వేరే కారణాలు ఏమైన జరిగివుండొచ్చనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 


TAGS: PRAKASHAM

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement