పాములవాక రాజుగెడ్డలో వ్యక్తి గల్లంతు

ABN , First Publish Date - 2021-10-25T06:11:03+05:30 IST

మండలంలోని పాములవాకలో గల రాజుగెడ్డలో ఓ వ్యక్తి గల్లంతైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పాములవాక రాజుగెడ్డలో వ్యక్తి గల్లంతు
గల్లంతైన జానకిరావు (ఫైల్‌)


  ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన 8 రెండు రోజులైనా కానరాని ఆచూకీ 

 పోలీసులు కేసు నమోదు

కోటవురట్ల, అక్టోబరు 24 : మండలంలోని పాములవాకలో గల రాజుగెడ్డలో ఓ వ్యక్తి గల్లంతైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ నారాయణరావు ఆదివారం సాయంత్రం తెలిపిన వివరాలిలా వున్నాయి.  పాములవాకలో ఏలేరు కాలువపై కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు జరిగాయి. ఇందుకోసం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బెల్లుపొడ గ్రామం నుంచి పదిహేను మంది కూలీలు నలభై రోజుల క్రితం వచ్చారు. పనులు పూర్తి కావడంతో ఇం దులో పదకొండు మంది దసరా తరు వాత స్వగ్రామానికి వెళ్లిపోయారు. మిగి లిన నలుగురిలో శుక్రవారం సాయం త్రం ముగ్గురు వ్యక్తులు దుర్గ, అనసాన జానకిరావు, మచిల్‌రెడ్డిలు వంతెన వద్ద ఉన్న తమ గుడారాల నుంచి కిరాణా సామగ్రి తెచ్చుకునేందుకు పాములవాక గ్రామం వెళ్లారు.ఆ సమయంలో భారీ వర్షం కురిసింది. వర్షం తగ్గిన తరువాత తాము ఉండే గుడారానికి తిరిగి వస్తుండగా, దారిలో ఉన్న రాజుగెడ్డ భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిం చడంతో ఈ ముగ్గరూ కొట్టుకు పోయారు. ఇందులో ఇద్దరు అతి కష్టమ్మీద ఒడ్డుకు చేరగా,   జానకిరావు (40) గల్లంతయ్యాడు. గ్రామ పెద్దలు శనివారం ఉదయం పది మందిని రెండు బృందాలు గెడ్డలోకి దింపి గాలింపు చేపట్టినా ఫలితం లేకపో యింది. దీంతో ఆదివారం జానకిరావు కుటుంబ సభ్యులు  ఫిర్యాదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపడుతున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - 2021-10-25T06:11:03+05:30 IST