Advertisement
Advertisement
Abn logo
Advertisement

ట్రాక్టర్‌ తగిలి వ్యక్తి మృతి

త్రిపురారం, డిసెంబరు 3: మండలంలో  ధాన్యం ట్రాక్టర్‌ తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది. గ్రామస్థుల కథనం ప్రకారం.... మర్రిగూడెం గ్రామానికి చెందిన నన్నెబోయిన అంజయ్య (56) తన బావమరిది చిమట సైదులుతో  కలిసి ధాన్యం ట్రాక్టర్‌పై సత్యనారాయణపురంలోని రఘురామా రైస్‌ మిల్లు వద్దకు వెళ్లాడు. అక్కడ సైదులు ట్రాక్టర్‌ వెనక్కు తీస్తుండగా  అంజయ్య వెనుక నిలుచుని సైడ్‌ చెపుతున్నాడు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ తగిలి గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడు అంజయ్యకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Advertisement
Advertisement