Advertisement
Advertisement
Abn logo
Advertisement

వంకలోపడి కొట్టుకుపోయి వ్యక్తి మృతి

గుడిపాల, నవంబరు 29: వంకలోపడి కొట్టుకుపోయి ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గుడిపాల మండలంలోని పాపిశెట్టిపల్లెకు చెందిన శ్రీరాములు యాదవ్‌(45) తన సొంత పనుల నిమిత్తం ఆదివారం రాసనపల్లెకు వెళ్లి అర్ధరాత్రి తిరిగి బయల్దేరాడు. రాసనపల్లె దళితవాడ సమీపంలో ఉన్న బ్రిడ్జి నుంచి కాలుజారి వంకలోపడి కొట్టుకుపోయాడు. సోమవారం ఉదయానికి కొంతదూరంలోని ఓ చెట్టుకు మృతదేహం తగులుకుని ఉండటాన్ని స్థానికులు గమనించి గుడిపాల ఎస్‌ఐ రాజశేఖర్‌కు సమాచారమిచ్చారు. ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందేలా తగు చర్యలు తీసుకుంటామని ఎంపీపీ ప్రసాద్‌ రెడ్డి హామీ ఇచ్చారు. 

Advertisement
Advertisement