Advertisement
Advertisement
Abn logo
Advertisement

బస్సులో ఫుల్లుగా ప్యాసింజర్లు.. ఛాన్స్ దొరికింది కదా అని ఓ యువతితో ఓ యువకుడి నీచపు చేష్టలు.. క్షణాల్లోనే సీన్ రివర్స్..!

ఒంటరిగా ఉండే మహిళలు, నిస్సహాయులైన యువతులను చూస్తే చాలు కొందరికి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. ముందూ, వెనుకా ఆలోచించకుండా వారిపై దాడి చేయడం, అత్యాచారం చేసేందుకు ప్రయత్నించడం వంటివి చేస్తుంటారు. అయితే అన్నిసార్లూ మగవారిదే పైచేయి ఉండదు.. కొన్ని సార్లు సీన్ రివర్స్ అవుతూ ఉంటుంది. బ్రెజిల్‌‌లో ఓ బస్సులో జరిగిన ఊహించని ఘటనతో ఓ ఆకతాయికి మైండ్ బ్లాక్ అయింది...

బ్రెజిల్‌లోని బెలెమ్‌కు చెందిన ఓ మహిళ ఈ నెల 20న బస్సులో ఇంటికి వెళ్తోంది. బస్సులో జనం కిటకిటలాడుతున్నారు. ఇంతలో ఓ వ్యక్తి చూపు.. ఈ మహిళపై పడింది. మహిళే కదా... ఏం చేస్తుందిలే అనుకుని పిచ్చి చేష్టలు చేయడం మొదలెట్టాడు. జనం ఎక్కువగా ఉండడంతో ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలో చేయి వేసేందుకు ప్రయత్నించాడు. అంతే ఒక్కసారిగా ఆ మహిళ కాస్తా.. మహంకాళిగా మారింది. బ్రూస్లీ తరహాలో ఆ వ్యక్తి ముఖంపై గట్టిగా ఒక్క పంచ్ ఇచ్చింది. దెబ్బకు అతడికి చుక్కలు కనబడ్డాయి. ఈమేంటీ ఇలా ఫైట్ చేస్తోందీ.. అని ఆలోచించేలోపే మళ్లీ గొంతును పట్టుకుని మరో నాలుగు బాదేసింది. అసలే ఆవేశంలో ఉన్న ఆ మహిళ దెబ్బలకు ఉక్కిరిబిక్కిరయ్యాడు.

ఇంతలో డ్రైవర్ బస్సును నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. పోలీసులకు విషయం తెలియజేయడంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మహిళ మాట్లాడుతూ.. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు పోరాడేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కరాటే తరహా శిక్షణ తీసుకున్నట్లు చెప్పింది. చాలా రోజుల పాటు ముయే థాయ్, కాపోయిరాలను అనే కళల్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలిపింది. మహిళలంతా ఇలాగే ధైర్యంగా పోరాడాలని సూచించింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement