ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-11-28T05:12:38+05:30 IST

నాగర్‌క ర్నూల్‌ జిల్లా ఊర్కొండ మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గుర్రం దశరథం(55) ఉరి వేసుకొని ఆత్మ హత్యకు పాల్పడ్డాడు.

ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న గుర్రం దశరథం

ఊర్కొండ, నవంబరు 27: నాగర్‌క ర్నూల్‌ జిల్లా ఊర్కొండ మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గుర్రం దశరథం(55) ఉరి వేసుకొని ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంరెడ్డిపల్లి గ్రామా నికి చెందిన దశరథం శనివారం సాయం త్రం కౌలుకు తీసుకొని సేద్యం చేస్తున్న భూమిలో ఉన్న మామిడి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరి వేసుకునే సమయంలో చెట్టు వద్ద వరి చేను కంకులు, టవాలు పక్కనే చెప్పులు వదిలాడని, అతని మృతికి కారణాలు తెలియాల్సి ఉందని గ్రామస్థులు పేర్కొ న్నారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభు త్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందలేదని అన్నారు. 



 కడుపు నొప్పితో...

పెద్దకొత్తపల్లి : కడుపునొప్పి భరించలేక ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధి లోని గంట్రావుపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఏఎస్సై వజ్రం తెలిపిన వివరాల ప్రకారం పెద్దకొత్తపల్లి మండ లం గంట్రావుపల్లి గ్రామానికి చెందిన దేశమోని సత్యనారాయణ(30) గత కొన్ని సంవత్సరాల నుంచి కడుపునొప్పితో బా ధపడుతుండేవాడు. ఆసుపత్రిలో చూపిం చినా తగ్గకపోవడంతో జీవితంపై విరక్తి చెంది శనివారం ఉదయం గ్రామ పంచా యతీ కార్యాలయం ముందు ఉన్న చెట్టుకు తాడుతో ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి దేశమోని లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నాగర్‌కర్నూల్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై  తెలిపారు. 



 పురుగుల మందు తాగి..

వెల్దండ: మండల పరిధిలోని మర్రిగుంత తండాకు చెందిన ఇస్తావత్‌ దేవ్‌సింగ్‌ (50) శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్థుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన దేవ్‌సింగ్‌ గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగులమందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. దేవ్‌సింగ్‌కు ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు ఉన్నారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 



Updated Date - 2021-11-28T05:12:38+05:30 IST