భార్యను చంపి 72 ముక్కలుగా చేసి రెండు నెలలు ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఈ టెకీ కేసులో అనూహ్య పరిణామం..!

ABN , First Publish Date - 2021-07-29T18:54:36+05:30 IST

హత్య గురించి ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఆమె మృతదేహాన్ని 72 ముక్కలుగా కోసి వాటిని ఫ్రిజ్‌లో దాచాడు..

భార్యను చంపి 72 ముక్కలుగా చేసి రెండు నెలలు ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఈ టెకీ కేసులో అనూహ్య పరిణామం..!

అతనో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. 1999లో అత్యంత వైభవంగా పెళ్లి చేసుకున్నాడు.. ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు తండ్రి కూడా అయ్యాడు.. ఆ తర్వాత భార్యతో మనస్పర్థలు వచ్చాయి.. అవి పెద్దవి కావడంతో 2010లో ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.. హత్య గురించి ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఆమె మృతదేహాన్ని 72 ముక్కలుగా కోసి వాటిని ఫ్రిజ్‌లో దాచాడు.. హతురాలి సోదరుడు ఇంటికి రావడంతో ఆ హత్య విషయం వెలుగులోకి వచ్చింది.


డెహ్రాడూన్‌కు చెందిన రాజేష్ గులాటి తన భార్య అనుపమా గులాటిని అతి కిరాతకంగా హత్య చేసి ఆమె మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో దాచిన ఘటన 2010లో సంచలనం సృష్టించింది. అనుపమ సోదరుడు ఆ ఇంటికి రావడంతో అసలు విషయం బయటపడింది. ఆ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. పోలీసులు వేంటనే రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఉత్తరాఖండ్ హైకోర్టు 2017లో తీర్పునిస్తూ రాజేష్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే పిల్లలు పేరు మీద బ్యాంకులో 14 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. 


11 ఏళ్లుగా జైల్లోనే రాజేష్ గులాటీ శిక్షను అనుభవిస్తున్నాడు. జైలు అధికారులు అతడి ప్రవర్తన బాగుందని సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. దీంతో తన సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని బెయిల్ కు దరఖాస్తు చేశాడు. ప్రస్తుతం జైలులో ఉన్న రాజేష్ ఉత్తరాఖండ్ హైకోర్టులో బెయిల్ పిటీషన్ వేశాడు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కూడా పరిశీలించి తనకు బెయిల్ ఇప్పించాల్సిందిగా కోరాడు. ఆ పిటీషన్‌ను విచారించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అత్యంత ఘోరమైన కేసులో నిందితుడైన రాజేష్‌కు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. దీంతో రాజేష్ తరఫు న్యాయవాది బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. 

Updated Date - 2021-07-29T18:54:36+05:30 IST