Abn logo
Sep 26 2021 @ 00:51AM

బహుజనులు రాజ్యాధికార సాధన కోసం పోరాడాలి

మాట్లాడుతున్న బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్న

- బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎనగందుల వెంన్న

సిరిసిల్ల టౌన్‌, సెప్టెంబర్‌ 25: బహుజనులు ఐక్యంగా రాజ్యాధికార సాధన కోసం పోరాడాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎనగందుల వెంన్న అన్నారు. శనివారం సిరిసిల్ల పట్టణం ప్రెస్‌ క్లబ్‌లో బీఎస్పీ జిల్లా ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. అనంతంర విలేకరుల సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎనగందుల వెంకన్న మాట్లాడుతూ బహుజనుల ఓట్లతో గద్దెనెక్కుతున్న నాయకులు అన్ని రంగాలలో బహుజనులను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. రాజ్యాధికార సాధనలో భాగంగా ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఎస్పీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు మండల ప్రభాకర్‌, రాష్ట్ర కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీన్‌కుమార్‌లు హాజరు అవుతున్నారని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్లలోని బీఎస్సీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, విద్యార్థులు, మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు చాకలి రమేష్‌, కార్యదర్శి బొడ్డు మహేందర్‌, పట్టణ కన్వీనర్‌ అన్నాల్‌దాస్‌ బాను, కో కన్వీనర్‌ అరకాల రమేష్‌, నాయకులు చిరంజీవి, అంజనేయులు, నరేందర్‌, వెంకటేష్‌, రవిలు పాల్గొన్నారు.

బీఎస్పీ సిరిసిల్ల పట్టణ కన్వీనర్‌గా అన్నల్‌దాస్‌ భాను, కో కన్వీనర్‌గా అరకాల రమే్‌షలను నియమిస్తూ బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎనగందుల వెంకన్న, జిల్లా అధ్యక్షుడు చాకలి రమే్‌షలు ఉత్తర్వులు జారి చేశారు. శనివారం సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో అన్నల్‌దాస్‌ భాను, అరకల రమే్‌షలకు నియామకపు ఉత్తర్వులను బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎనగందుల వెంకన్న, జిల్లా అధ్యక్షుడు చాకలి రమే్‌షలు అందజేశారు.