గాలికుంటు వ్యాధి నివారణ టీకా తప్పనిసరి

ABN , First Publish Date - 2021-10-14T05:06:22+05:30 IST

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా పశు సంవర్ధకశాఖ సంయుక్త సంచాలకుడు డాక్టర్‌ ఎం.కిశోర్‌ ఆదేశించారు. బుధవారం కోటబొమ్మాళి మండలం దుప్పలపాడు, జలుమూరు మండలం దరివాడ, సంతబొమ్మాళి మండలం కృష్ణచంద్రపురం, టెక్కలి మండలం శ్రీరం గం, బన్నువాడ గ్రామాల్లో నిర్వహిస్తున్న టీకాల కార్యక్రమాన్ని పరిశీ లించారు.

గాలికుంటు వ్యాధి నివారణ టీకా తప్పనిసరి
టీకాల కార్యక్రమం పరిశీలిస్తున్న జేడీ కిశోర్‌


 పశు సంవర్ధకశాఖ సంయుక్త సంచాలకుడు కిశోర్‌ 

టెక్కలి/కోటబొమ్మాళి/సంతబొమ్మాళి/జలుమూరు, అక్టోబరు 13: పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా పశు సంవర్ధకశాఖ సంయుక్త సంచాలకుడు డాక్టర్‌ ఎం.కిశోర్‌ ఆదేశించారు. బుధవారం కోటబొమ్మాళి మండలం దుప్పలపాడు, జలుమూరు మండలం దరివాడ, సంతబొమ్మాళి మండలం కృష్ణచంద్రపురం, టెక్కలి మండలం శ్రీరంగం, బన్నువాడ గ్రామాల్లో నిర్వహిస్తున్న టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో.. 38 మండలాల్లో పశువైద్యాధికారుల ఆధ్వర్యంలో 152 బృందాలతో వ్యాక్సినేషన్‌ చేయిస్తున్నామన్నారు. 5,58,400 పశువులకు టీకాలు వేయడం లక్ష్యంగా నిర్దేశించామన్నారు. టీకా వేసిన ప్రతి పశువుకు జియో ట్యాగింగ్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 85,543 పశువులకు టీకాలు వేశామని, రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు, గడ్డి కోసే యంత్రాలు అందిస్తున్నామని, అలాగే మినరల్‌ మిక్సర్‌, సమీకృత దాణా కూడా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.  300 బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, 125 అమూల్‌ మిల్క్‌ కలెక్షన్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. కార్యక్రమంలో ఏడీలు మంచు కరుణాకరరావు, రఘునాథ్‌, తిలారు, కొల్లిపాడు,  పశు వైద్యాధికారులు కిరణ్‌కుమార్‌, ఆర్‌.చంద్రరావు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-10-14T05:06:22+05:30 IST