Abn logo
Sep 26 2021 @ 00:47AM

కొలువుదీరిన జడ్పీ పాలకవర్గం

జడ్పీ చైర్‌పర్సనగా ప్రమాణ స్వీకారం చేస్తున్న బోయ గిరిజమ్మ

చైర్మన్‌ పీఠంపై తొలి బీసీ మహిళ బోయ గిరిజమ్మ

వైస్‌ చైర్మన్లుగా సుధాకర్‌రెడ్డి, నాగరత్నమ్మ.. కో-ఆప్షన్‌సభ్యులుగా బాషా, వలి..

62 మంది జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం

అనంతపురం విద్య, సెప్టెంబరు 25: జిల్లాపరిషత్‌ కొత్త పాలకవర్గం శనివారం అట్టహాసంగా కొలువుదీరింది. జడ్పీ చె ౖర్మన్‌, వైస్‌ చైర్మన్లు, కో-ఆప్షన్‌సభ్యులతోపాటు, ఇతర స భ్యులు కొలువుదీరారు. జడ్పీ చైర్మన్‌ పీఠంపై తొలి బీసీ మహిళ ఆశీనులయ్యారు. చైర్‌పర్సన్‌గా బోయ గిరిజమ్మ, వైస్‌ చైర్మన్లుగా కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి, నాగరత్నమ్మ, కో-ఆప్షన్‌సభ్యులుగా బా షా, ఫయాజ్‌ వలిని ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకోగా, జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి వారితో ప్రమాణస్వీకారం చే యించారు. కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎన్నికల పరిశీలకుడు హర్షవర్ధన్‌.. జడ్పీ కో-ఆప్ష న్‌సభ్యులతోపాటు, జడ్పీచైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నిక నిర్వహించారు. ఉదయం జడ్పీచైర్‌పర్సన్‌గా గిరిజమ్మ, వైస్‌ చైర్మన్లు కా మిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి, నాగరత్నమ్మకు సంబంధించిన బీఫామ్స్‌ను రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ, రాప్తా డు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి.. కలెక్టర్‌కు అందించారు. తర్వాత కో-ఆప్షన్‌సభ్యులుగా బాషా, వలి తమ నామినేషన్లను జిల్లా కలెక్టర్‌కు అందించారు. మధ్యాహ్నం జడ్పీటీసీ సభ్యులు ఒక్కొక్కరు ప్రాంగణానికి చేరుకున్నారు. జడ్పీ చైర్మన్‌ గిరిజమ్మ మంత్రితోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌ నుంచి ర్యాలీగా జడ్పీకి వచ్చారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, జడ్పీ సమావేశ మందిరానికి చేరుకున్నారు. 


జడ్పీ కో-ఆప్షన్‌సభ్యులుగా బాషా, వలి

జడ్పీ ప్రత్యేక సమావేశాన్ని కలెక్టర్‌ నిర్వహించారు. జడ్పీ కో-ఆప్షన్‌సభ్యులుగా గోరంట్లకు చెందిన ఏహెచ్‌ బాషా, గాండ్లపెంటకు చెందిన ఫయాజ్‌ వలి మినహా ఎవరూ నామినేషన్లు దాఖ లు చేయకపోవడంతో వారిని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు కలెక్టర్‌ ప్రకటించారు. అనంతరం వారికి ధ్రువీకరణ పత్రాలు అందించారు. ఇద్దరు సభ్యులతో కలెక్టర్‌ ప్రమాణస్వీకారం చే యించారు. తర్వాత కోరం పూర్తిగా రాగా.. 62 మంది జడ్పీటీసీ సభ్యులతో కలెక్టర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. మధ్యాహ్న భోజనానంతరం జడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ ని ర్వహించారు.


‘ప్రత్యక్ష దైవం జగనన్న సాక్షిగా..’ అంటూ...

మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్‌ ప్రత్యే క సమావేశం నిర్వహించి చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక నిర్వహించారు. ఆత్మకూరు జడ్పీటీసీ సభ్యురాలు బోయ గిరిజమ్మను చైర్మన్‌గా ఇద్దరు జడ్పీటీసీ సభ్యులు బలపర్చారు. ఇతరులు ఎ వ రూ నామినేషన్‌ వేయకపోవడంతో ఆ మె జడ్పీ చైర్‌ పర్సనగా ఏకగీవ్రంగా ఎ న్నికైనట్టు కలెక్టర్‌ ప్రకటించారు. డిక్లరేషన్‌ అందించి, ప్రమాణ స్వీకారం చేయమన్నారు. దీంతో జడ్పీ చైర్‌పర్సనగా ఆమె ‘ప్రత్యక్ష దైవం జగనన్న సాక్షిగా..’ అంటూ ప్రమాణస్వీకారం చేసి, వేదికపై ఆశీనులయ్యారు. తర్వాత వైస్‌చైర్మన్లుగా కామిరెడ్డిపల్లి సుధాకర్‌ రెడ్డి, నాగరత్నమ్మను ఇద్దరు చొప్పున అధికార పార్టీ జడ్పీటీసీలు బలపర్చారు. వారు మినహా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఏకగీవ్రంగా ఎంపికైనట్లు కలెక్టర్‌ ప్రకటిస్తూ ధ్రువీకరణ పత్రాలు అందించి, ప్రమా ణ స్వీకారం చేయించారు. వేదికపై ఆశీనులైన వారికి కలెక్టర్‌, ఎన్నికల పరిశీలకులు శుభాకాంక్షలు తెలిపారు.


ప్రత్యేక ఆకర్షణగా  అగళి జడ్పీటీసీ సభ్యుడు 

జడ్పీ సమావేశ మందిరంలో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన అగళి జడ్పీటీసీ సభ్యుడు ఉమేష్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రమాణ స్వీకారానికి టీడీపీ రంగు పసుపు చొక్కాతో వచ్చిన ఆయనను చూసిన వారందరూ అదిగో ఆయనే జిల్లాలో టీడీపీ నుంచి గెలిచిన ఒకేఒక్కరు అంటూ ముచ్చటించారు. మొత్తానికి జడ్పీలో టీడీపీ జడ్పీటీసీ సభ్యుడిగా ఆయన ఆకర్షణగా నిలిచారు.


సభలో 73 ఏళ్ల మహిళ 

జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార సమావేశంలో అత్యంత వ యోవృద్ధురాలు, యాడికి జడ్పీటీసీ సభ్యురాలు అనంతమ్మ ప్ర త్యేకంగా కనిపించారు. కొలువుదీరిన 62 మంది జడ్పీటీసీ సభ్యుల్లోనూ, ఇద్దరు కో-ఆప్షన్‌సభ్యుల్లోనూ ఆమే అత్యధిక వయసు న్న సభ్యురాలు. 73 ఏళ్ల వయస్సులోనూ ఆమె సభలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉత్సాహంగా కనిపించారు. తర్వాత ఆమె ‘ఆంరఽధజ్యోతి’తో మా ట్లాడుతూ... తనకు 73 ఏళ్ల నీ, తాను గ తంలో ఎంపీపీగా కూడా పనిచేశానని ముచ్చటించారు.


కిటకిటలాడిన జడ్పీ, ప్రాంగణం...

కొత్తగా కొలువుదీరిన పాలకవర్గం, ప్రజాప్రతినిధులతో జడ్పీ కార్యాలయం, ఆ ప్రాంగణం ప్రజాప్రతినిధులతో, కిటకిటలాడింది. కొలువుదీరిన సభ్యులకు ప్రజాప్రతినిధులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రితో పా టు మండలి విప్‌ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇక్బాల్‌, ఎంపీ గోరంట్ల మాధవ్‌, తలారి రంగయ్య, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, ఉషాశ్రీచరణ్‌, సిద్దారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్‌మెట్టు గోవిందరెడ్డి, ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ కార్యదర్శి ఆలూరి సాంబశివారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్‌నదీం, ఆర్టీసీ రీజనల్‌ చైర్మన్‌ మంజుల, జేసీ సిరి, జడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాసులు, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.


జడ్పీ ఉద్యోగులకు ఆకలి బాధలు

జిల్లా పరిషత్‌ ఉద్యోగులు శనివారం ఆకలితో అలమటించారు. జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారంతోపాటు చైర్మన్‌, వైస్‌చైర్మ న్లు, కో-ఆప్షన్‌సభ్యుల ఎన్నిక జడ్పీలో నిర్వహించారు. జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారంతోపాటు, కో-ఆప్ష న్‌సభ్యుల ఎన్నిక పూర్తవడంతో చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నికకు మధ్యాహ్నం విరా మం ఇచ్చారు. ఉదయం నుంచి పనిచేసిన ఉద్యోగులు, సిబ్బంది రెండు ముద్దలు నోట్లో వేసుకుందామని వెళితే భోజనాలు లేవు. దీంతో ఉద్యోగులు ఆకలితో అలమటించారు. ఉదయం నుంచి పరుగు పరుగున పనిచేసిన తమకే భోజనం దొరక్కపోవడంతో చాలామంది అవస్థ పడ్డారు. ముఖ్యంగా వయసు మళ్లిన వారు, షుగర్‌, బీపీ వంటి సమస్యలతో బాధపడేవారి తిప్పలు వర్ణనాతీతం. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల వెంట వచ్చిన వారు, జడ్పీటీసీల వెంటవచ్చిన నాయకులు సైతం ఇబ్బంది పడ్డారు. కొందరు ఉద్యోగులు చెప్పినా జడ్పీ ఉన్నతాధికారి వారి మాటలు పెడ చెవిన పెట్టి తక్కువ సంఖ్యలో భోజనాలు ఆర్డర్‌ ఇవ్వడం వల్లే ఉద్యోగులు ఇబ్బంది పడాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ఈక్రమం లో ఆలస్యంగా భోజనాలు రావటం, 3 గంటలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కావడంతో ఉద్యోగులు రెం డు ముద్దలు నోట్లో వేసుకుని, మళ్లీ హడావుడిగా విధులకు హాజరవాల్సి వచ్చింది.


కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు